దుబాయ్ డ్యూటీ ఫ్రీ డ్రా..భారతీయ ప్రవాసిని వరించిన $1 మిలియన్..!!

- May 08, 2025 , by Maagulf
దుబాయ్ డ్యూటీ ఫ్రీ డ్రా..భారతీయ ప్రవాసిని వరించిన $1 మిలియన్..!!

దుబాయ్: అజ్మాన్‌లో నివసిస్తున్న 52 ఏళ్ల భారతీయుడు వేణుగోపాల్ ముల్లాచేరి దుబాయ్ డ్యూటీ ఫ్రీ మిలీనియం మిలియనీర్ డ్రాలో $1 మిలియన్ గెలుచుకున్నాడు. ఏప్రిల్ 23న టెర్మినల్ 2 అరైవల్ షాపులో కొనుగోలు చేసిన టికెట్ నంబర్ 1163తో సిరీస్ 500 ప్రమోషన్‌లో అతను 500వ విజేతగా నిలిచాడు.  ఒక దశాబ్దానికి పైగా అజ్మాన్‌లో నివసిస్తున్న ముల్లాచేరి.. అధికారిక దుబాయ్ డ్యూటీ ఫ్రీ ఫేస్‌బుక్ పేజీలో ప్రత్యక్ష డ్రాను వీక్షించాడు. తన పేరు ప్రకటించగానే ఎంతో సంతోషం కలిగిందని పేర్కొన్నారు.

ముల్లాచేరి ఇద్దరు పిల్లల తండ్రి.  అజ్మాన్‌లోని ఒక కంపెనీకి IT సపోర్ట్ స్పెషలిస్ట్‌గా పనిచేస్తున్నాడు. 15 సంవత్సరాలకు పైగా ప్రమోషన్‌లో పాల్గొంటున్నాడు.  ఈ సందర్భంగా స్పందిస్తూ.. ‘‘దుబాయ్ డ్యూటీ ఫ్రీ మిలీనియం మిలియనీర్‌లో 500వ విజేతగా నిలిచినందుకు నేను సంతోషంగా ఉన్నాను. ఈ ప్రసిద్ధ ప్రమోషన్‌లో చాలా కాలంగా పాల్గొంటున్న. చివరకు అనేక మంది విజేతలలో ఒకరిగా ఉండటం నాకు చాలా ఆనందంగా ఉంది. దుబాయ్ డ్యూటీ ఫ్రీకి చాలా ధన్యవాదాలు.” అని పేర్కొన్నారు. కేరళకు చెందిన ముల్లాచేరి 1999 నుండి మిలీనియం మిలియనీర్ ప్రమోషన్‌లో $1 మిలియన్ గెలుచుకున్న 249వ భారతీయుడిగా నిలిచాడు. 

దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని కాన్‌కోర్స్ Bలో వేడుక డ్రా జరిగింది. దుబాయ్ సివిల్ ఏవియేషన్ అథారిటీ అధ్యక్షుడు, దుబాయ్ డ్యూటీ ఫ్రీ చైర్మన్ షేక్ అహ్మద్ బిన్ సయీద్ అల్ మక్తూమ్ హాజరయ్యారు.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com