ఒమన్‌లోని భారతీయ పాఠశాలల్లో 5వ తరగతి నుండి AI కోర్సులు..!!
- May 11, 2025
మస్కట్: ఒమన్‌లోని భారతీయ పాఠశాలల్లో 5వ తరగతి నుంచి ఆధునిక విద్యా వ్యవస్థను ప్రవేశపెడుతున్నట్లు ఒమన్‌లోని ఇండియన్ స్కూల్స్ డైరెక్టర్ల బోర్డు ఛైర్మన్ సయ్యద్ అహ్మద్ సల్మాన్ తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థులు, విద్యావేత్తలను భవిష్యత్తుకు అవసరమైన నైపుణ్యాలు, వనరులతో సన్నద్ధం చేయడానికి ఉపయోగపడతాయన్నారు.
2025–27 కాలానికి దాని వ్యూహాత్మక ఎజెండాలో భాగంగా 5వ తరగతి నుండి విద్యార్థుల కోసం ఆర్థిక అక్షరాస్యత, AI (కృత్రిమ మేధస్సు) కోర్సులనును ప్రవేశపెట్టడానికి బోర్డు ఆమోదం తెలిపిందని పేర్కొన్నారు. ఈ వారం ఆర్థిక అక్షరాస్యత కోర్సులను ప్రవేశపెడుతుండగా, వేసవి సెలవుల తర్వాత AI పాఠ్యాంశాలు అమలు అవుతాయని తెలిపారు.
ఇండియన్ స్కూల్ మస్కట్ (జిబ్రూ క్యాంపస్), ఇండియన్ స్కూల్ దర్సైట్, ఇండియన్ స్కూల్ సీబ్, ఇండియన్ స్కూల్ సుర్, ఇండియన్ స్కూల్ సలాలాలో ప్రధాన ప్రాజెక్టులు జరుగుతున్నాయని, మరిన్ని పాఠశాలలు అభివృద్ధి కోసం సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. పెరుగుతున్న కమ్యూనిటీ డిమాండ్‌కు అనుగుణంగా బార్కా, సినావ్‌లలో కొత్త ఇండియన్ స్కూల్‌లను స్థాపించడానికి సాధ్యాసాధ్యాల అధ్యయనాలను కూడా బోర్డు ప్రారంభించిందని తెలిపారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో డేంజరస్ యానిమల్స్ పై కఠిన చట్టం..!!
- ఒమన్‌లో దొంగతనం ఆరోపణలపై వ్యక్తి అరెస్టు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 30 డేట్స్ అనౌన్స్..!!
- బ్యాంకులలో త్వరలో ఫ్రైజ్ డ్రాలు..!!
- దోహాలో అత్యవసరంగా అరబ్-ఇస్లామిక్ సమ్మిట్..!!
- ఫేక్ ప్లాట్‌ఫారమ్‌లతో నేరాలు..ముగ్గురు సిరియన్లు అరెస్టు..!!
- క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ పుట్టినరోజు వేడుకల్లో చాముండేశ్వరనాథ్
- కేంద్రం కొత్త ఆర్థిక మార్పులు, ఉత్పత్తి ధరల ప్రభావం
- నేడు భారత్- పాకిస్తాన్, హై వోల్టేజ్ మ్యాచ్!
- భారత్-పాకిస్తాన్ మ్యాచ్: నిషేధిత వస్తువుల జాబితా..!!