షార్జా కేర్ లీవ్: ప్రైవేట్ సంస్థలు అమలు చేయాలని పిలుపు..!!
- May 15, 2025
యూఏఈ: ప్రభుత్వ ఉద్యోగుల కోసం తన అద్భుతమైన కేర్ లీవ్ విధానాన్ని షార్జా అమలు చేస్తుంది. వైకల్యాలు లేదా దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్న పిల్లల తల్లులకు మూడు సంవత్సరాల వరకు వేతనంతో కూడిన సెలవులను అందిస్తోంది. ప్రైవేట్ సంస్థలతో సహా అన్ని రంగాలలో పని చేసే తల్లులకు ఇలాంటి సౌకర్యాలను అందజేయాలని పిలుపునిచ్చింది.
NAMA ఉమెన్ అడ్వాన్స్మెంట్ డైరెక్టర్ జనరల్ మరియం అల్ హమ్మది మాట్లాడుతూ.. షార్జా కేర్ లీవ్ చొరవ పూర్తి స్థాయిలో అమలు కావాలంటే, అన్ని రంగాలలోని సంస్థలు సౌకర్యవంతమైన, సహాయక కార్యాలయాలను చురుకుగా పెంపొందించడం చాలా అవసరం అని అల్ హమ్మది పేర్కొన్నారు. "సరళమైన పని గంటలు, రిమోట్ లేదా హైబ్రిడ్ వర్క్ మోడల్స్ వంటి పద్ధతులు తల్లుల పనిచేసే సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుతాయి." అని తెలిపారు.
షార్జా పాలకుడు షేక్ డాక్టర్ సుల్తాన్ అల్ ఖాసిమి ఆదేశాల ప్రకారం.. కొత్తగా ప్రవేశపెట్టబడిన కేర్ లీవ్.. షార్జా ప్రభుత్వ రంగంలోని తల్లులకు పూర్తి జీతంతో కూడిన సెలవును మంజూరు చేస్తుంది. దీనిని మూడు సంవత్సరాల వరకు పొడిగించవచ్చు. షార్జాను "గ్లోబల్ మోడల్"గా అల్ హమ్మది వర్ణించిన ఈ విధానాన్ని NAMA నిర్వహించిన సమగ్ర రెండేళ్ల అధ్యయనం తర్వాత అభివృద్ధి చేశారు.
ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లల తల్లులలో 2,545 మంది ఉద్యోగులుగా ఉన్నారని, 5,361 మంది పని చేయడం లేదని, 352 మంది పదవీ విరమణ చేశారని మానవ వనరులు & ఎమిరేటైజేషన్ మంత్రిత్వ శాఖ (MoHRE) డేటాను వెల్లడిస్తూ అల్ హమ్మది పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!
- ఓవర్టేకింగ్, లేన్ స్కిప్పింగ్.. డ్రోన్లతో ట్రాఫిక్ పర్యవేక్షణ..!!
- అలెర్ట్: ఫుజైరాలో భారీ వర్షాలు..వాటర్ ఫాల్స్ కనువిందు..!!
- ప్రైవేట్ స్కూళ్లలో సంస్కరణలకు బహ్రెయిన్ శ్రీకారం..!!
- షురా కౌన్సిల్ ను సందర్శించిన భారత ప్రతినిధి బృందం..!!
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్