కువైట్‌లో జూన్ 7 నుండి వేసవి సీజన్ ప్రారంభం..!!

- May 25, 2025 , by Maagulf
కువైట్‌లో జూన్ 7 నుండి వేసవి సీజన్ ప్రారంభం..!!

కువైట్: వేసవి ప్రారంభానికి సూచనగా భావించే 'తురాయ' సీజన్ జూన్ 7న కువైట్‌లో ప్రారంభమవుతుందని అల్-ఓజైరి సైంటిఫిక్ సెంటర్ తెలిపింది. 'అల్-బతీన్' సీజన్ ఆదివారం ప్రారంభమై 13 రోజుల పాటు కొనసాగుతుందని, ఇది "అల్-కన్నా" సీజన్ చివరి దశను సూచిస్తుందన్నారు. "అల్-బతీన్" సమయంలో పగటిపూట 13 గంటల 47 నిమిషాలకు పైగా ఉంటుందని, సూర్యాస్తమయం సాయంత్రం 6:38 గంటల వరకు ఆలస్యం అవుతుందని, రాత్రి సమయం తక్కువగా నమోదు అవుతుందన్నారు. ప్రస్తుతం ఉష్ణోగ్రతలు 50°Cకి దగ్గరగా ఉన్నప్పటికీ, వేసవి అసలు ప్రారంభం అని భావించే “తురాయ” సీజన్ జూన్ 7న ప్రారంభమవుతుందని కేంద్రం పేర్కొంది. “తురాయ” సీజన్‌లో గల్ఫ్ దేశాలతో సహా అనేక దేశాలలో ఉష్ణోగ్రతలు అధిక స్థాయికి చేరుకుంటాయని వెల్లడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com