సౌదీ ప్రైవేట్ రంగానికి 4 రోజులపాటు ఈద్ అల్-అధా సెలవులు..!!

- May 29, 2025 , by Maagulf
సౌదీ ప్రైవేట్ రంగానికి 4 రోజులపాటు ఈద్ అల్-అధా సెలవులు..!!

రియాద్: ప్రైవేట్, లాభాపేక్షలేని రంగాలలోని కార్మికులకు నాలుగు రోజులపాటు ఈద్ అల్-అధా సెలవులు ఉంటాయని సౌదీ మానవ వనరులు మరియు సామాజిక అభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రకటించింది. జూన్ 5  అరాఫత్ దినోత్సవం నాడు సెలవులు ప్రారంభమై జూన్ 8 వరకు సెలవులు ఉంటాయని తెలిపింది. జూన్ 5 (గురువారం), జూన్ 6 (శుక్రవారం) ఈద్ అల్-అధా వేడుకల మొదటి రోజు అని సౌదీ అరేబియా సుప్రీంకోర్టు మంగళవారం ప్రకటించింది. నెలవంక కనిపించడంతో మే 28 (బుధవారం) ధుల్ హిజ్జా మొదటి రోజు అని సుప్రీంకోర్టు ఇదివరకు ప్రకటించింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com