2 విదేశీ బ్యాంకు శాఖలపై Dh18 మిలియన్లకు పైగా జరిమానా..యూఏఈ
- May 29, 2025
యూఏఈ: విదేశీ బ్యాంకుల రెండు శాఖలపై యూఏఈ కేంద్ర బ్యాంకు భారీ జరిమానా విధించింది. ఈ ఆర్థిక ఆంక్షలు ఎమిరేట్స్ మనీలాండరింగ్ నిరోధక చట్టాలకు అనుగుణంగా జారీ చేసినట్టు తెలిపింది. రెండు బ్యాంకులపై Dh18,100,000 జరిమానా విధించారు. మొదటి బ్యాంకుకు Dh10,600,000 జరిమానా విధించగా, రెండవ బ్యాంకుకు Dh7,500,000 జరిమానా విధించినట్లు సెంట్రల్ బ్యాంక్ తన ప్రకటనలో తెలిపింది. ఆ బ్యాంకులు మనీలాండరింగ్ నిరోధక , ఉగ్రవాదం, చట్టవిరుద్ధ సంస్థలకు ఆర్థిక సహాయం అందించాయని విచారణలో తేలిందని, దాంతో వాటిపై జరిమానాలు విధించినట్లు పేర్కొన్నారు.
ఈ నెల ప్రారంభంలో యాంటీ-మనీలాండరింగ్ (AML) మరియు కౌంటర్-టెర్రరిజం ఫైనాన్సింగ్ నిబంధనల ప్రకారం అథారిటీ ఒక ఎక్స్ఛేంజ్ హౌస్‌పై Dh200 మిలియన్ల జరిమానా విధించింది. ఒక బ్రాంచ్ మేనేజర్‌కు కూడా Dh500,000 జరిమానా విధించింది. అలాగే లైసెన్స్ పొందిన ఆర్థిక సంస్థలలో ఎటువంటి సంబంధాలు ఉండకుండా శాశ్వతంగా నిషేధించిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- భారత్‌కు అమెరికా కొత్త రాయబారిగా సెర్గియో గోర్ నియామకం
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!
- ఓవర్‌టేకింగ్, లేన్ స్కిప్పింగ్.. డ్రోన్లతో ట్రాఫిక్ పర్యవేక్షణ..!!
- అలెర్ట్: ఫుజైరాలో భారీ వర్షాలు..వాటర్ ఫాల్స్ కనువిందు..!!
- ప్రైవేట్ స్కూళ్లలో సంస్కరణలకు బహ్రెయిన్ శ్రీకారం..!!
- షురా కౌన్సిల్ ను సందర్శించిన భారత ప్రతినిధి బృందం..!!
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్