వికలాంగులకు కేటాయించిన స్థలంలో పార్కింగ్.. ఒక నెల జైలు శిక్ష..!!

- June 04, 2025 , by Maagulf
వికలాంగులకు కేటాయించిన స్థలంలో పార్కింగ్.. ఒక నెల జైలు శిక్ష..!!

కువైట్: వికలాంగుల కోసం కేటాయించిన స్థలంలో పార్కింగ్ చేసినందుకు ఒక వ్యక్తి దోషిగా తేలిన తర్వాత ట్రాఫిక్ మిస్‌డిమీనర్ కోర్టు ఒక నెల జైలు శిక్ష విధించింది. అతని డ్రైవింగ్ లైసెన్స్‌ను సస్పెండ్ చేసింది. ప్రత్యేక అవసరాలు ఉన్న వ్యక్తుల హక్కులను పరిరక్షించడంలో కఠినంగా వ్యవహారిస్తామని కోర్టు తెలిపింది.  

ఏప్రిల్ 22 నుండి కొత్త ట్రాఫిక్ చట్టం అమల్లోకి రాకముందే ఉల్లంఘన జరిగినందున, వికలాంగుల హక్కులపై 2010 నాటి చట్టం నంబర్ 8 ఆధారంగా కోర్టు తన తీర్పును ప్రకటించింది. ఈ చట్టంలోని ఆర్టికల్ 63 ప్రకారం, వికలాంగుల కోసం కేటాయించిన పార్కింగ్ స్థలాన్ని చట్టవిరుద్ధంగా ఉపయోగించే ఎవరైనా ఒక నెల వరకు జైలు శిక్ష, KD 100 వరకు జరిమానా లేదా రెండింటినీ ఎదుర్కోవలసి ఉంటుంది.

సవరించబడిన ట్రాఫిక్ చట్టంలోని ఆర్టికల్ 33 బిస్ ప్రకారం.. ఒకటి నుండి మూడు సంవత్సరాల వరకు జైలు శిక్షతోపాటు  KD 600 నుండి KD 1,000 వరకు జరిమానాలు  ఉన్నాయి.  వికలాంగుల కోసం ఉద్దేశించి సౌకర్యాల దుర్వినియోగాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని కోర్టు వెల్లడించింది.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com