ఆ ఒక్కటే ప్రమాదకరం.. 4,000 కంటే ఎక్కువ హానికరమైన పదార్థాలు..!!

- June 07, 2025 , by Maagulf
ఆ ఒక్కటే ప్రమాదకరం.. 4,000 కంటే ఎక్కువ హానికరమైన పదార్థాలు..!!

యూఏఈ: స్మోకింగ్ చేసేవారు తరచుగా "ఒక్క సిగరెట్ తాగితే ఎటువంటి హాని జరగదు" లేదా అది "అప్పుడప్పుడు" మాత్రమే అనే మాటలను తరచూగా ఉపయోగిస్తుంటారు. ఈ క్రమంలో తమ స్మోకింగ్ అలవాట్లను సమర్థించుకోవడం సర్వసాధారణంగా చూస్తుంటాం. అయితే, ప్రతి సిగరెట్ తాగేవారికి అపారమైన హానిని కలుగు జేస్తుంది. అదే సమయంలో స్మోకింగ్ చేసే సమయంలో వెలువడే పొగ కారణంగా తమ ప్రియమైన వారికి హాని కూడా చేస్తుంది. ఒక సిగరెట్‌లో 4,000 కంటే ఎక్కువ హానికరమైన పదార్థాలు ఉంటాయి. ఇందులో 94 విషపూరిత రసాయనాలు ఉన్నాయని దుబాయ్ హెల్త్ అథారిటీ హెచ్చరించింది. కాల్చినప్పుడు ఈ రసాయనాలు మరింత ప్రమాదకరమైనవిగా మారుతాయని తెలిపింది.  

ఈ రసాయనాలు అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, క్యాన్సర్లు (నోరు, గొంతు, చిగుళ్ళు, పెద్దప్రేగు), ఉబ్బసం మరియు బ్రోన్కైటిస్, గుండెపోటులు, స్ట్రోక్స్, కడుపు పూతలు, ఆస్టియోపోరోసిస్ వంటి రోగాల బారిన పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

కాగా, స్మోకింగ్ అలవాటును మానడం అనేది కష్టంగా ఉన్నప్పటికీ.. కుటుంబం, వైద్య సహాయం వంటి సహాయక వ్యవస్థలు ఈ ప్రక్రియలో మీకు సహాయపడతాయి.  DHA ప్రకారం.. స్మొకింగ్ మానేయడం తేదీని నిర్ణయించడం , క్రమం తప్పకుండా వ్యాయామాన్ని దినచర్యలో భాగం చేసుకోవడం వంటి చర్యలు సహాయపడుతుంది. స్మోకింగ్ మానేయడం మీ జీవన నాణ్యతను బాగా మెరుగుపరుస్తుందని, అనేక ప్రయోజనాలను కలిగి ఉందని తెలిపారు. శరీర వ్యవస్థల కణజాల మరమ్మత్తుకు మద్దతు ఇస్తుంది. సాధారణ ఆక్సిజన్ స్థాయిలను పునరుద్ధరిస్తుంది. రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరుస్తుంది. తీవ్రమైన అనారోగ్యాల ప్రమాదాన్ని తగ్గిస్తుందని వెల్లడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com