దుబాయ్‌కు భారీ ఊరట: కీలక ఆంక్షలకు గుడ్‌బై!

- June 14, 2025 , by Maagulf
దుబాయ్‌కు భారీ ఊరట: కీలక ఆంక్షలకు గుడ్‌బై!

దుబాయ్‌: దుబాయ్‌కు తాజాగా యూరోపియన్ యూనియన్(EU) భారీ ఊర‌ట క‌లిగింది. మనీలాండరింగ్ మరియు ఉగ్రవాదానికి ఆర్థిక మద్దతు ఇచ్చే అవకాశమున్న హై-రిస్క్ దేశాల జాబితా నుంచి యూఏఈను తొలగిస్తున్నట్లు యూరోపియన్ యూనియన్ మంగళవారం అధికారికంగా ప్రకటించింది.ఇంత‌కాలం హై-రిస్క్ జాబితాలో ఉండ‌టం వ‌ల్ల అంతర్జాతీయ పెట్టుబడులు, బ్యాంకింగ్ లావాదేవీలపై అర‌బ్ దేశాల‌కు కొన్ని పరిమితులు, అదనపు నియంత్రణలు ఉండేవి.

కానీ, ఇప్పుడు యూఏఈ పై ఆ ఆంక్షలు ఎత్తేశారు.గ‌తంలో ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (FATF) యూఏఈను గ్రే లిస్ట్ లో చేర్చింది.దాని తర్వాత యూఏఈ ప్రభుత్వం మనీలాండరింగ్, టెర్రరిజం ఫైనాన్సింగ్‌పై పోరాటానికి పలు సంస్కరణలు చేపట్టింది.ఈ సంస్కరణలు యూరోపియన్ యూనియన్ కు న‌చ్చేట‌ట్లుగా ఉండటంతో, తాజాగా ఆ దేశాన్ని హై-రిస్క్ జాబితా నుంచి తొలగించారు.ఈ నిర్ణయంతో యూఏఈ అంతర్జాతీయ ఆర్థిక రంగంలో విశ్వసనీయతను మరింతగా బలోపేతం చేసుకుంది.

హై-రిస్క్ దేశాల జాబితా నుంచి యూఏఈకు విముక్తి ల‌భించ‌డంతో ఇది విదేశీ పెట్టుబడులు మరింతగా ఆకర్షించడానికి ఎంత‌గానో దోహదపడుతుంది.యూరప్ దేశాలతో సంబంధాలు మెరుగవుతాయి.అంతర్జాతీయ బ్యాంకులకు అర‌బ్ దేశాల‌పై నమ్మకం కూడా పెరుగుతుంది. అలాగే ఇండియాతో సహా అనేక దేశాలకు యూఏఈ ప్రధాన వ్యాపార భాగస్వామిగా ఉండడం వల్ల ఇయు తాజా నిర్ణయం ఆయా దేశాలకూ ప్రభావం చూపవచ్చ‌ని అంటున్నారు. కాగా, యూఏఈ తో పాటు బార్బడోస్, జిబ్రాల్టర్, జమైకా, పనామా, ఫిలిప్పీన్స్, సెనెగల్ మరియు ఉగాండాలను కూడా హై-రిస్క్ దేశాల జాబితా నుంచి యూరోపియన్ కమిషన్ తొలగించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com