అబుదాబిలో డ్రైవర్‌లెస్ ఫ్లయింగ్ టాక్సీ టెస్ట్ సక్సెస్..ప్రత్యేకతలు..!!
- June 15, 2025
యూఏఈ: యూఏఈ రాజధాని అబుదాబిలో నిర్వహించిన అటానమస్ ఫ్లయింగ్ టాక్సీ టెస్ట్ ఫ్లైట్ ప్రదర్శన విజయవంతమైంది. దాంతో అబుదాబి ఎయిర్ మొబిలిటీ భవిష్యత్తుకు ఇది కీలక మలుపుగా పేర్కొంటున్నారు. అబుదాబి ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీస్ (ADIO) విడుదల చేసిన 50 సెకన్ల వీడియో క్లిప్‌లో.. ఎలక్ట్రిక్ డ్రైవర్‌లెస్ వర్టికల్ టేకాఫ్, ల్యాండింగ్ (eVTOL) తోపాటు అబుదాబి క్రూయిజ్ టెర్మినల్ హెలిప్యాడ్ నుండి టేకాఫ్ అవుతున్నట్లు.. అబుదాబి మెరీనా పైన క్రూజ్ చేస్తున్నట్లు చూపించారు.
చైనీస్ టెక్నాలజీ కంపెనీ EHang మరియు మల్టీ లెవల్ గ్రూప్ (MLG) సహకారంతో స్మార్ట్ అండ్ అటానమస్ సిస్టమ్స్ కౌన్సిల్ (SASC), అబుదాబి ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీస్ (ADIO) మద్దతుతో టెస్ట్ ఫ్లైట్ నిర్వహించారు. అయితే, EHang-ఆధారిత ఫ్లయింగ్ టాక్సీ గాలిలో ఎన్ని నిమిషాలు ప్రయాణించిందో ADIO పేర్కొనలేదు. కానీ ఈ టెస్ట్ ఫ్లైట్ "ఫ్లయింగ్ టాక్సీల సామర్థ్యం, కార్యాచరణ సామర్థ్యాలను అంచనా వేయడం లక్ష్యంగా పెట్టుకుంది" అని తెలిపింది.
"అబుదాబితోపాటు ప్రపంచవ్యాప్తంగా ఎయిర్ టాక్సీలు రోజువారీ జీవితంలో ఒక భాగమవుతాయని మేము నిరూపిస్తున్నాము. తదుపరి తరం రవాణాలో ఎమిరేట్‌ను ప్రపంచ నాయకుడిగా చేస్తాము." అని ADIO డైరెక్టర్ జనరల్ బదర్ అల్ ఒలామా తెలిపారు.
రెండు సీట్ల ఫ్లయింగ్ టాక్సీ
పరీక్షించబడిన ఫ్లయింగ్ టాక్సీ EHang యొక్క EH216‑S మోడల్. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి సర్టిఫైడ్, పైలట్‌లెస్, రెండు సీట్ల eVTOL ఫ్లైట్. EH216-S 16 ప్రొపెల్లర్‌లను అమర్చారు. ప్రతి ప్రొపెల్లర్ డ్యూయల్-మోటార్ సిస్టమ్ ద్వారా పనిచేస్తుంది. మొత్తం 32 ఇండిపెండెంట్ ఎలక్ట్రిక్ మోటార్లు ఉంటాయి. EHang ప్రకారం.. టేకాఫ్, ల్యాండింగ్ సమయంలో ఒక వ్యవస్థ విఫలమైతే, మరొక వ్యవస్థ ఆటోమెటిక్ గా పనిచేయడం ప్రారంభిస్తుంది. చైనీస్ టెక్నాలజీతో నడిచే ఫ్లయింగ్ తక్కువ శబ్దంతో, రన్‌వే లేకుండా పనిచేస్తుందని, ఇది భవిష్యత్ నగరాల అభివృద్ధి చెందుతున్న మౌలిక సదుపాయాలకు ఆదర్శంగా ఉంటుందని ADIO పేర్కొంది.
తాజా వార్తలు
- భారత్‌కు అమెరికా కొత్త రాయబారిగా సెర్గియో గోర్ నియామకం
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!
- ఓవర్‌టేకింగ్, లేన్ స్కిప్పింగ్.. డ్రోన్లతో ట్రాఫిక్ పర్యవేక్షణ..!!
- అలెర్ట్: ఫుజైరాలో భారీ వర్షాలు..వాటర్ ఫాల్స్ కనువిందు..!!
- ప్రైవేట్ స్కూళ్లలో సంస్కరణలకు బహ్రెయిన్ శ్రీకారం..!!
- షురా కౌన్సిల్ ను సందర్శించిన భారత ప్రతినిధి బృందం..!!
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్