సార్ క్రాష్ డ్రైవర్ పై జూన్ 23న విచారణ..!!
- June 16, 2025
మనామా: సార్లో జరిగిన విషాదకరమైన కారు ప్రమాదానికి కారణమైన వ్యక్తిపై జూన్ 23న విచారణ జరుగుతుందని పబ్లిక్ ప్రాసిక్యూషన్ ప్రకటించింది. ఈ ప్రమాదంలో ఓ తండ్రి, తల్లితోపాటు వారి బిడ్డ ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం జరిగిన సమయంలో డ్రైవర్ మాదకద్రవ్యాలు, మద్యం సేవించి ఉన్నాడని దర్యాప్తులో తేలింది. అతను చట్టపరమైన పరిమితికి మించి వేగంతో కారును నడుపుతున్నాడని, ప్రాథమిక ట్రాఫిక్ భద్రతా నియమాలను పూర్తిగా ఉల్లంఘించాడని వెల్లడించారు.
మత్తులో నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ అకస్మాత్తుగా డివైడర్ దాటి దూసుకెళ్లి ఎదురుగా వస్తున్న బాధితుల కారును ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో తండ్రి, తల్లి సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. వారి పిల్లలు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఒకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. రోడ్డుపై నిర్లక్ష్యంగా వ్యవహారించి, ఇతరుల ప్రాణాలకు ముప్పు కలిగించే వారికి కఠినమైన శిక్షలు విధించాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి.
తాజా వార్తలు
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!
- సౌదీలో అక్రమ డ్రైవర్ల పై ఉక్కుపాదం..!!
- సెప్టెంబర్‌లో ఖతార్ కు పోటెత్తిన ప్యాసింజర్స్..!!
- స్వీట్లు తినిపించి పిల్లల గొంతుకోసి చంపిన తండ్రి
- షార్జాలో జైవాకర్ల పై కఠిన చర్యలు..!!
- యూరప్‌కు వెళుతున్నారా? అమల్లోకి వచ్చిన న్యూ రూల్స్..!!
- BHD 52,000 VAT ఎగవేతపై దర్యాప్తు పూర్తి..!!
- భారత్‌కు అమెరికా కొత్త రాయబారిగా సెర్గియో గోర్ నియామకం
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!