గల్ఫ్ లో సంక్షోభం: ఈయూ మంత్రులతో సౌదీ మినిస్టర్ భేటీ..!!

- June 17, 2025 , by Maagulf
గల్ఫ్ లో సంక్షోభం: ఈయూ మంత్రులతో సౌదీ మినిస్టర్ భేటీ..!!

రియాద్: సౌదీ విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫర్హాన్.. యూరోపియన్ యూనియన్ మంత్రులతో మాట్లాడారు. ఈయూ విదేశాంగ, భద్రతా విధాన ఉన్నత ప్రతినిధి, యూరోపియన్ కమిషన్ ఉపాధ్యక్షుడు కాజా కల్లాస్,  ఇటలీ ఉప ప్రధాన మంత్రి,  విదేశాంగ , అంతర్జాతీయ సహకార మంత్రి ఆంటోనియో తజాని ఫోన్ కాల్స్ చేసి ఇజ్రాయెల్-ఇరాన్ ఉద్రిక్తతలపై సమీక్షించారు. ఈ సందర్భంగా  ప్రిన్స్ ఫైసల్, కల్లాస్ మధ్య ప్రాంతీయ పరిణామాలపై చర్చలు జరిగాయి. గల్ఫ్ ప్రాంతంలోని కీలక సమస్యలను పరిష్కరించడానికి జరుగుతున్న ప్రయత్నాలపై ఇరువురు సమీక్షిచారు. ఈ కాల్ సమయంలో, సౌదీ -ఇటాలియన్ విదేశాంగ మంత్రులు ఈ ప్రాంతంలోని గల్ఫ్ లోని తాజా పరిణామాలపై చర్చించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com