అంతర్జాతీయ శాంతి సంస్థ అధ్యక్షుడిని కలిసిన ఖతార్ యూఎన్ఓ ప్రతినిధి..!!

- June 20, 2025 , by Maagulf
అంతర్జాతీయ శాంతి సంస్థ అధ్యక్షుడిని కలిసిన ఖతార్ యూఎన్ఓ ప్రతినిధి..!!

దోహా: ఐక్యరాజ్యసమితిలో ఖతార్ శాశ్వత ప్రతినిధి హెచ్ ఇ షేఖా అలియా అహ్మద్ బిన్ సైఫ్ అల్-థాని న్యూయార్క్‌లోని ఖతార్ శాశ్వత మిషన్ ప్రధాన కార్యాలయంలో అంతర్జాతీయ శాంతి సంస్థ అధ్యక్షుడు హెచ్ హెచ్ ప్రిన్స్ జీద్ బిన్ రాద్ అల్ హుస్సేన్‌ను కలిశారు. ఈ సందర్భంగా అనేక ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై చర్చించారు.  ముఖ్యంగా మధ్యప్రాచ్యంలో ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య తాజా పరిణామాలపై చర్చించారు. అలాగే గాజాలో మానవీయ సాయాన్ని అందించే విషయమై చర్చించారు. ఈ ప్రాంతంలో శాంతి, స్థిరత్వాన్ని ప్రోత్సహించడానికి అంతర్జాతీయ ప్రయత్నాలను ముందుకు తీసుకెళ్లే మార్గాలపై కూడా వారు అభిప్రాయాలను పంచుకున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com