దుబాయ్ లో టూరిస్టుకు నెలరోజుల జైలుశిక్ష విధించిన కోర్టు..!!
- June 20, 2025
యూఏఈ: దుబాయ్‌లోని ఒక మాల్లోని లగ్జరీ రిటైల్ స్టోర్ నుండి 7,000 దిర్హామ్‌ల విలువైన డిజైనర్ హ్యాండ్‌బ్యాగ్‌ను దొంగిలించినందుకు ఒక మహిళా యూరోపియన్ పర్యాటకురాలికి ఒక నెల రోజుల జైలుశిక్ష విధించారు. జైలు శిక్ష అనుభవించిన తర్వాత ఆమెను దేశం నుండి బహిష్కరించనున్నారు.
కోర్టు రికార్డుల ప్రకారం.. ఇటీవల ఈ సంఘటన జరిగింది. ఐదుగురు వ్యక్తులు ( ఒక పురుషుడు, నలుగురు మహిళలు ) కస్టమర్లుగా దుకాణాన్ని సందర్శించారు. వారు వెళ్లిన కొద్దిసేపటికే దుకాణ సహాయకుడు హ్యాండ్‌బ్యాగ్ మాయం కావడాన్ని గమనించాడు. స్టోర్‌లోని సీసీ కెమెరాలను పరిశీలించగా, వారిలో ఒక మహిళ చోరీ చేసినట్లు గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న దుబాయ్ పోలీసులు అనుమానితురాలిని గుర్తించి, అరెస్టు చేశారు. అనంతరం మిస్‌డిమీనర్ కోర్టుకు రిఫర్ చేయగా.. ఆమెకు ఒక నెల జైలుశిక్ష, తరువాత బహిష్కరించాలని తీర్పు ప్రకటించారు.
తాజా వార్తలు
- దేశానికి మోడీ దొరికిన ఆణిముత్యం: సీఎం చంద్రబాబు
- నిమిష ప్రియకేసులో తాజా అప్డేట్
- జాయెద్ నేషనల్ మ్యూజియం డిసెంబర్ 3న ప్రారంభం..!!
- వాడిలో ప్రమాదకరమైన విన్యాసాలు..పలువురు అరెస్టు..!!
- 2026లో ఖతార్ GDP 6% పైగా పెరుగుతుంది: IMF
- ఫేక్ ట్రాఫిక్ చెల్లింపు లింక్‌లపై హెచ్చరిక జారీ..!!
- క్రెడెన్షియల్ లెటర్ అందుకున్న పరమితా త్రిపాఠి..!!
- సౌదీలో తగ్గిన వార్షిక ద్రవ్యోల్బణం రేటు..!!
- ఇస్రో భారీ ఉద్యోగాల నోటిఫికేషన్
- సుప్రీంకోర్టులో తెలంగాణ గవర్నమెంట్ కి ఎదురుదెబ్బ