రేడియేషన్ ప్రమాదం లేదు.. సౌదీ అణు కమిషన్ నిర్ధారణ..!!
- June 21, 2025
రియాద్: ఇజ్రాయెల్-ఇరాన్ వివాదంతోపాటు ప్రాంతీయ ఉద్రిక్తతల నేపథ్యంలో సౌదీ అరేబియా అణు, రేడియోలాజికల్ రెగ్యులేటరీ కమిషన్ (NRRC) కీలక ప్రకటన చేసింది.దేశాన్ని ప్రభావితం చేసే రేడియేషన్ లీకేజీలు లేవని స్పష్టం చేసింది. ఈ మేరకు తన అధికారిక X ఖాతాలో పోస్ట్ చేసింది. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య సైనిక తీవ్రత కొనసాగుతున్నప్పటికీ, సౌదీ వ్యాప్తంగా రేడియేషన్ స్థాయిలు సాధారణంగానే ఉన్నాయని, పర్యావరణం సురక్షితంగా ఉందని NRRC తెలిపింది.
అంతకుముందు ఇరాన్ అరక్ పరిశోధన రియాక్టర్‌పై సైనిక దాడి ఎటువంటి రేడియోలాజికల్ పరిణామాలను కలిగి లేదని, అక్కడ ప్రస్తుతం అణు ఇంధనం లేదని కమిషన్ తెలిపింది. 24/7 పరిణామాలను పర్యవేక్షిస్తున్నట్లు స్పష్టం చేసింది.అత్యవసర కార్యకలాపాల కేంద్రం..అత్యంత అప్రమత్తంగా ఉందన్నారు.రేడియోలాజికల్ ప్రభావాల నుండి ప్రజలను, పర్యావరణాన్ని రక్షించడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు.
తాజా వార్తలు
- దేశానికి మోడీ దొరికిన ఆణిముత్యం: సీఎం చంద్రబాబు
- నిమిష ప్రియకేసులో తాజా అప్డేట్
- జాయెద్ నేషనల్ మ్యూజియం డిసెంబర్ 3న ప్రారంభం..!!
- వాడిలో ప్రమాదకరమైన విన్యాసాలు..పలువురు అరెస్టు..!!
- 2026లో ఖతార్ GDP 6% పైగా పెరుగుతుంది: IMF
- ఫేక్ ట్రాఫిక్ చెల్లింపు లింక్‌లపై హెచ్చరిక జారీ..!!
- క్రెడెన్షియల్ లెటర్ అందుకున్న పరమితా త్రిపాఠి..!!
- సౌదీలో తగ్గిన వార్షిక ద్రవ్యోల్బణం రేటు..!!
- ఇస్రో భారీ ఉద్యోగాల నోటిఫికేషన్
- సుప్రీంకోర్టులో తెలంగాణ గవర్నమెంట్ కి ఎదురుదెబ్బ