దుబాయ్ నివాస భవనాల్లో అక్రమ దందా..!!
- June 23, 2025
యూఏఈ: దుబాయ్‌లోని అధికారులు ఎమిరేట్‌లోని అనేక ప్రాంతాలలో అనుమతి లేని చిన్న గదుల నిర్వహణపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. నగరంలోని అనేక ప్రాంతాలలో ఈ దందా నడుస్తుందని, ఈ పద్ధతి ప్రమాదకరమని దుబాయ్ మునిసిపాలిటీ (DM) హెచ్చరించింది. వీటిని అరికట్టేందుకు నగరంలోని అనేక ప్రాంతాలలో నిరంతరం తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపింది. అల్ రిగ్గా, అల్ మురక్కాబాత్, అల్ బర్షా, అల్ సత్వా, అల్ రఫా వంటి అధిక జనసాంద్రత కలిగిన నివాస ప్రాంతాలలో ఈ అక్రమ దందా ఎక్కువగా ఉందని పేర్కొన్నారు.
ఈ క్రమంలో రెసిడెన్సీ నిబంధనలను పాటించాల్సిన అవసరం గురించి భవన యజమానులకు నోటీసుల ద్వారా అధికారికంగా తెలియజేస్తున్నామని మునిసిపాలిటీ పేర్కొన్నారు. దుబాయ్‌లో రెంటర్స్, ఇంటి యజమానులు అపార్ట్మెంట్లో ఏదైనా విభజన లేదా మార్పులను సృష్టించడానికి అవసరమైన అనుమతులను పొందడం తప్పనిసరి అని గుర్తుచేశారు.
తక్కువ ధరకే..
చాలా మంది దుబాయ్ నివాసితులకు, ముఖ్యంగా తక్కువ ఆదాయ వర్గాల వారికి ఇలాంటి చిన్న గదులు తక్కువ ధరకే నివాస సదుపాయాన్ని అందిస్తాయి. అనేక వెబ్సైట్లు, సోషల్ మీడియా ఛానెల్లలోఇలాంటి గదుల ధర నెలకు Dh600 నుండి ప్రారంభమవుతుందని ప్రచారం చేస్తున్నారని తెలిపారు. అయితే, ఇందుకోసం భవన యజమానులు మునిసిపాలిటీ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని, ఈ ధోరణి నివాసితుల భద్రతకు ముప్పు కలిగిస్తుందని మునిసిపాలిటీ పేర్కొంది. ఇటువంటి మార్పులు అగ్నిప్రమాదాలు వంటి తీవ్రమైన సంఘటనల జరిగిన సమయంలో ప్రమాదాన్ని తీవ్రంగా పెంచుతుందన్నారు. ఇలా అనేక కారణాలతో 2వేల సంవత్సర ప్రారంభంలో అక్రమ గదుల విభజనలు, విల్లాలను పంచుకోవడం నిషేధించారు.
తాజా వార్తలు
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!
- ఓవర్‌టేకింగ్, లేన్ స్కిప్పింగ్.. డ్రోన్లతో ట్రాఫిక్ పర్యవేక్షణ..!!
- అలెర్ట్: ఫుజైరాలో భారీ వర్షాలు..వాటర్ ఫాల్స్ కనువిందు..!!
- ప్రైవేట్ స్కూళ్లలో సంస్కరణలకు బహ్రెయిన్ శ్రీకారం..!!
- షురా కౌన్సిల్ ను సందర్శించిన భారత ప్రతినిధి బృందం..!!
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్