AI-ఆధారిత ట్రాఫిక్ కెమెరాలతో అబుదాబిలో రోడ్లు సురక్షితం..!!
- June 26, 2025
యూఏఈ: AI-ఆధారిత ట్రాఫిక్ కెమెరాలతో అబుదాబిలో రోడ్లు సురక్షితంగా మారాయని అబుదాబి పోలీస్ టెలికమ్యూనికేషన్స్ స్పెషలిస్ట్ డాక్టర్ హమద్ ఖలీఫా అల్ నుయిమి తెలిపారు. దుబాయ్లో ఖలీజ్ టైమ్స్ నిర్వహించిన ఫ్యూచర్సెక్ సమ్మిట్ 2025లో ఆయన పాల్గొని మాట్లాడారు. ఎమిరేట్ ట్రాఫిక్ వ్యవస్థలలో కృత్రిమ మేధస్సు ప్రమాదాలు జరగడానికి ముందే అది ఎలా తగ్గిస్తుందో వివరించారు.
“క్లిష్టమైన వ్యవస్థలు ఇకపై బ్యాక్-ఎండ్ సర్వర్లలో మాత్రమే కాదు, అవి రోడ్లపై ఉన్నాయి” అని డాక్టర్ అల్ నుయిమి అన్నారు. “అబుదాబిలో, మీరు లేన్ల మధ్య లేదా టెయిల్గేటింగ్ వంటి ప్రమాదకరంగా డ్రైవింగ్ చేస్తుంటే, AI-ఆధారిత కెమెరాలు రియల్ టైమ్ లో దానిని గుర్తించి ఫ్లాగ్ చేస్తాయి. ఈ ఉల్లంఘనలు కేవలం జరిమానాలు జారీ చేయడమే కాదు. అవి ఢీకొనడం జరగకముందే నిరోధిస్తాయి.” అని వివరించారు. “డ్రైవర్లను శిక్షించడం మాత్రమే కాదు.. రోడ్లను సురక్షితంగా చేయడమే లక్ష్యం. జీవితాలను రక్షించడానికి మేము AI సాంకేతికతను ఈ విధంగా ఉపయోగిస్తున్నాము.” అని ఆయన అన్నారు.
తాజా వార్తలు
- మహిళా ఫార్ములా 4 రేసర్
- మిసెస్ యూనివర్స్ 2025 గా భారత మహిళ
- జపాన్లో శాశ్వత నివాసానికి గోల్డెన్ ఛాన్స్!
- Gitex 2025: స్మార్ట్ కార్లు వీసా ఉల్లంఘనలు గుర్తింపు..!!
- వాడివేడిగా బహ్రెయిన్ పార్లమెంట్ సమావేశాలు..!!
- వెండింగ్ యంత్రాల ద్వారా మెడిసిన్ అమ్మకాలపై కీలక నిర్ణయం..!!
- ఒమన్ లో కార్మికుల రక్షణకు కొత్త నిబంధనలు..!!
- సౌదీ అరేబియాలో కొత్తగా 1,516 పురావస్తు ప్రదేశాలు..!!
- నవంబర్ 4 నుంచి ఖతార్ లో బాస్కెట్బాల్ మినీ వరల్డ్ కప్..!!
- ఏపీ సమాచార శాఖ కమిషనర్గా కె.ఎస్.విశ్వనాథన్