బహ్రెయిన్ లో ఉత్సాహంగా జగన్నాథుడి రథయాత్ర..!!

- June 29, 2025 , by Maagulf
బహ్రెయిన్ లో ఉత్సాహంగా జగన్నాథుడి రథయాత్ర..!!

మనామా: బహ్రెయిన్ లోని ఒడియా కమ్యూనిటీ, ఇస్కాన్ కనూ గార్డెన్ సహకారంతో జూన్ 27న ప్రపంచ ప్రఖ్యాత రథయాత్రను భక్తి, ప్రవత్తులతో ఉత్సాహంగా జరుపుకుంది. పూరీ రథయాత్ర పవిత్ర సంప్రదాయాలను అనుసరించి, ముగ్గురు దైవిక దేవతలు - లార్డ్ జగన్నాథుడు, లార్డ్ బలభద్రుడు,  మాతా సుభద్రలను ఇస్కాన్ ఆలయం, కనూ గార్డెన్ నుండి అధారీ పార్కు వరకు ఉత్సవంగా రథయాత్రను నిర్వహించారు.  డప్పు చప్పుళ్ల మధ్య 'హరిబోల్'., 'జై జగన్నాథ్' అంటూ పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు రథాన్ని లాగారు. సాంప్రదాయ ఆచారం ప్రకారం,..  బహ్రెయిన్ ఒడియా సమాజ్ అధ్యక్షుడు రామచంద్ర సాహు, రాధా గోపాల కృష్ణ ఆలయం యాదవపతి కృష్ణదాస్ ప్రభు, ప్రశాంత్ ప్రభు రథంపై చెరా పహాంరా కర్మను నిర్వహించారు. ఆ తర్వాత రథం ఊరేగింపు ప్రారంభమైంది.

బహ్రెయిన్ లోని భారత రాయబారి వినోద్ కె. జాకబ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన రథయాత్ర గురించి పెద్ద సంఖ్యలో హాజరైన భక్తులకు వివరించారు. బహ్రెయిన్ లో భారతదేశ సామాజిక-సాంస్కృతిక వారసత్వాన్ని వ్యాప్తి చేయడంలో చురుకుగా పాల్గొన్నందుకు బహ్రెయిన్ ఒడియా సమాజ్ సభ్యులను ప్రశంసించారు.

బహ్రెయిన్ ఒడియా సమాజ్ కోశాధికారి ప్రియదత్ రాయ్, సాంస్కృతిక కార్యదర్శి అంకితా నాయక్,  క్రీడా కార్యదర్శి అమరేష్ పాండా భక్తుల సమక్షంలో జగన్నాథ సంస్కృతి గురించి వివరించారు. విదేశాలలో రథయాత్ర జరుపుకోవడం ప్రతి ఒడియా డయాస్పోరా సభ్యునికి గొప్ప అదృష్టమని సొసైటీ ప్రధాన కార్యదర్శి శాంతను సేనాపతి, ప్రజా సంబంధాల కార్యదర్శి అమర్‌నాథ్ సుబుధి అన్నారు.

సాంప్రదాయ చ్చప్పన్ భోగతో సహా వివిధ రకాల మహాప్రసాదాలను తయారు చేసి రథంపై స్వామికి సమర్పించారు.  జూలై 5న జరిగే బహుద యాత్ర (తిరుగు ప్రయాణం)తో ఉత్సవాలు తొమ్మిది రోజుల పాటు కొనసాగుతాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com