‘హదత’ను ప్రారంభించిన ఒమన్ రవాణా మంత్రిత్వ శాఖ..!!
- July 02, 2025
మస్కట్: సుల్తాన్ ఖబూస్ విశ్వవిద్యాలయం (SQU) సహకారంతో ఒమన్ రవాణా, కమ్యూనికేషన్లు, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ ‘హదత’ అనే సైబర్ భద్రతా కేంద్రాన్ని ప్రారంభించింది. ఈ కేంద్రం సైబర్ భద్రతా రంగంలో పరిశోధన, ఆవిష్కరణ, అభివృద్ధిని ప్రోత్సహించనుంది. జాతీయ ఆవిష్కరణలకు ఇది కేంద్రంగా పనిచేస్తుందని మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ డాక్టర్ అలీ బిన్ అమెర్ అల్ షిధాని తెలిపారు.
ఈ సందర్భంగా “హదత” సైబర్ భద్రతా కేంద్రం గురించిన వివరాలను ప్రదర్శించారు. “హదాతా” ద్వారా అరబ్ స్థాయిలో సైబర్ సెక్యూరిటీ రంగంలో ఒమన్ కీలక ముందడుగు వేసిందని వక్తలు కొనియాడారు. సాంకేతిక పెట్టుబడులను పెంచడం, సాంకేతికతలను స్థానికీకరించడం, ఒమానీ యువత నైపుణ్యాలను అభివృద్ధి చేయడం, ప్రపంచవ్యాప్తంగా పోటీపడే సాంకేతిక పరిష్కారాలను అభివృద్ధి చేయడానికి ఈ కేంద్రం పనిచేస్తుందని వెల్లడించారు.
తాజా వార్తలు
- భారత్కు అమెరికా కొత్త రాయబారిగా సెర్గియో గోర్ నియామకం
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!
- ఓవర్టేకింగ్, లేన్ స్కిప్పింగ్.. డ్రోన్లతో ట్రాఫిక్ పర్యవేక్షణ..!!
- అలెర్ట్: ఫుజైరాలో భారీ వర్షాలు..వాటర్ ఫాల్స్ కనువిందు..!!
- ప్రైవేట్ స్కూళ్లలో సంస్కరణలకు బహ్రెయిన్ శ్రీకారం..!!
- షురా కౌన్సిల్ ను సందర్శించిన భారత ప్రతినిధి బృందం..!!
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్