ఇల్లీగల్ సంస్థలు..లైసెన్స్ లేని ప్రాక్టీస్..ఇన్వెస్టర్లకు హెచ్చరిక..!!

- July 02, 2025 , by Maagulf
ఇల్లీగల్ సంస్థలు..లైసెన్స్ లేని ప్రాక్టీస్..ఇన్వెస్టర్లకు హెచ్చరిక..!!

యూఏఈ: లైసెన్స్ లేని సంస్థలకు వ్యతిరేకంగా ప్రజలను హెచ్చరించిస్తూ సెక్యూరిటీస్ అండ్ కమోడిటీస్ అథారిటీ (SCA) అడ్వైజ్ జారీ చేసింది. ఒక అనామక కంపెనీ తనను తాను గల్ఫ్ ఇస్లామిక్ ఇన్వెస్ట్‌మెంట్స్ LLCగా తప్పుగా ప్రచారం చేసుకుంటుందని వారు హెచ్చరించారు. అధికారిక ప్రకటనలో SCA "అధికారిక గల్ఫ్ ఇస్లామిక్ ఇన్వెస్ట్‌మెంట్స్ LLCతో అనుబంధం లేని సంస్థలతో నిర్వహించే ఏవైనా లావాదేవీలకు బాధ్యత వహించదు" అని వారు తెలిపారు.

"ఒప్పందాలు కుదుర్చుకునే ముందు లేదా ఆర్థిక బదిలీలు చేసే ముందు ఏదైనా సంస్థ చట్టబద్ధతను ధృవీకరించాలని పెట్టుబడిదారులకు సూచించారు. ఆర్థిక మోసాలకు గురికాకుండా  https://www.sca.gov.ae/ar/open-data/licensed-companies.aspx#page=1 వద్ద అందుబాటులో ఉన్న లైసెన్స్ పొందిన కంపెనీల అధికారిక జాబితాను సరిచూసుకోవాలని సూచించారు.  

లైసెన్స్ లేని దుబాయ్ ఆధారిత కంపెనీ
దుబాయ్ ఆధారిత కంపెనీ ALYWRW FOR MARKETING AND PR L.L.C తో ఎలాంటి కార్యాకలాపాలు పెట్టుకోవద్దని, ఆర్థిక కార్యకలాపాలు లేదా సేవలను నిర్వహించడానికి దీనికి లైసెన్స్ లేదని స్పష్టం చేశారు.   MEX అట్లాంటిక్ కార్పొరేషన్‌ కు కూడా ఎలాంటి లైసెన్స్ లేదని ఇటీవల స్పష్టం చేసింది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com