ఫైలాకా ద్వీపంలో మునిసిపాలిటీ తనిఖీలు ప్రారంభం..!!
- July 02, 2025
కువైట్: కువైట్ మునిసిపాలిటీలోని ఇంజనీరింగ్ ఆడిట్ విభాగం అధికారులు.. ఫైలాకా ద్వీపంలో ఇంజనీరింగ్ ఉల్లంఘనలపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఈ మేరకు వారు ప్రత్యేకంగా తనిఖీలు ప్రారంభించారు. వివిధ వర్గాల నుంచి భారీగా అందిన ఫిర్యాదులకు ప్రతిస్పందనగా తనిఖీలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.
ప్రభుత్వ యాజమాన్యంలోని భూమిపై ఆక్రమణకు సంబంధించిన అనేక కేసులలో ఉల్లంఘనలను గుర్తించినట్లు మునిసిపాలిటీ తనిఖీ బృందం తెలిపింది. ఉల్లంఘనలకు పాల్పడిన వారికి హెచ్చరికలు జారీ చేసినట్లు, హెచ్చరిక వ్యవధి ముగిసిన తర్వాత చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. తనిఖీల సందర్భంగా గుర్తించిన అన్ని ఉల్లంఘనలను పరిష్కరించడానికి, ప్రజా ఆస్తులను రక్షించడానికి అవసరమైన చట్టపరమైన విధానాలతో ముందుకు సాగుతున్నట్లు మునిసిపాలిటీ పేర్కొంది.
తాజా వార్తలు
- భారత్కు అమెరికా కొత్త రాయబారిగా సెర్గియో గోర్ నియామకం
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!
- ఓవర్టేకింగ్, లేన్ స్కిప్పింగ్.. డ్రోన్లతో ట్రాఫిక్ పర్యవేక్షణ..!!
- అలెర్ట్: ఫుజైరాలో భారీ వర్షాలు..వాటర్ ఫాల్స్ కనువిందు..!!
- ప్రైవేట్ స్కూళ్లలో సంస్కరణలకు బహ్రెయిన్ శ్రీకారం..!!
- షురా కౌన్సిల్ ను సందర్శించిన భారత ప్రతినిధి బృందం..!!
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్