ఫేక్ ఫారెక్స్ స్కామ్‌ల వెనుక ఇండియన్ భారతీయ కాల్ సెంటర్లు..!!
- July 03, 2025
యూఏఈ: యూఏఈలో వెలుగు చూసిన ఫేక్ ఫారెక్స్ స్కామ్ వెనుక ఇండియాలోని కాల్ సెంటర్లు ఉన్నాయని సైబర్ సెక్యూరిటీ నిపుణులు గుర్తించారు. భారత్ లోని నోయిడాలో రెండు, జైపూర్ కేంద్రంగా ఒక కాల్ సెంటర్ కేంద్రం ఈ స్కామ్ నడుస్తుందని పేర్కొన్నారు. అవి దుబాయ్ ఆధారిత ఫారెక్స్ (విదేశీ మార్పిడి) సంస్థలుగా నటిస్తూ, అనుమానం కలుగుకుండా పెట్టుబడిదారులను మోసం చేస్తున్నారని, ఇందుకుగాను స్పూఫ్డ్ +971 నంబర్‌లను ఉపయోగిస్తున్నాయని వెల్లడైంది.
ఈ కేసుకు సంబంధించి మాజీ ఉద్యోగులు వివరాలను వెల్లడించారు. తమకు ఇచ్చే కాంటాక్ట్ లీస్టులలో అనేక మంది యూఏఈ మొబైల్ నంబర్లు ఉన్నాయని తెలిపారు. ఇండియాలోని కాల్ సెంటర్ నుంచి దుబాయ్ లోని కస్టమర్లకు కాల్ చేస్తామని తెలిపారు. కొన్ని రోజులకు కొత్త డేటా వస్తుందని, ఏజెంట్లకు పంపిణీ చేస్తారని తెలిపారు. ప్రతి కేంద్రంలో 50 నుండి 100 మంది ఏజెంట్లు ఉంటారన్నారు. తాము ఉదయం 8 నుండి రాత్రి 11 గంటల వరకు రోజుకు 150 కాల్స్ చేస్తామని తెలిపారు. కాల్స్ యూఏఈ నంబర్‌ల కనిపించేందుకు సాఫ్ట్‌వేర్ ద్వారా రూట్ అవుతాయని, అవి దుబాయ్‌లోని వ్యాపార కేంద్రాల నుండి వచ్చినట్లు బాధితులకు కనిపిస్తాయ తెలిపారు. ఎవరైనా +971ని చూసిన వెంటనే, వారు ఫోన్ అటెంట్ చేస్తారని, వారి దృష్టిని ఆకర్షించడానికి అది సరిపోతుందని ఆమె వివరించింది.
భారతదేశం ఇప్పటికే టెలి-ఫ్రాడ్‌కు ప్రపంచవ్యాప్త హాట్‌స్పాట్ గా ఉంది. 2022లోనే, అమెరికన్లు స్కామ్‌ల వల్ల $10 బిలియన్లకు పైగా కోల్పోయారు. చాలా వరకు వీటి వెనుక భారతీయ కాల్ సెంటర్లకు చెందినవిగా గుర్తించారు. కొన్ని బందిపోటు కార్యకలాపాలు నెలకు $600,000 కంటే ఎక్కువ వసూలు చేస్తున్నాయి. ఇప్పుడు యూఏఈ నివాసితులు తమ పట్టులో ఉన్నందున, భారతీయ స్కామ్ సిండికేట్‌లు తమ మోసాలను విస్తృతం చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ప్రవాస భారతీయులు, యూఏఈ నివాసితులు లక్ష్యంగా వీరి పనిచేస్తారని పేర్కొన్నారు.
ఈ మేరకు యూఏఈ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ X లో హెచ్చరిక జారీ చేసింది. పెట్టుబడి పెట్టే ముందు సెక్యూరిటీస్ అండ్ కమోడిటీస్ అథారిటీ (SCA) ద్వారా ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్‌ల లైసెన్సింగ్ స్థితిని ధృవీకరించాలని నివాసితులను కోరింది.
తాజా వార్తలు
- భారత్‌కు అమెరికా కొత్త రాయబారిగా సెర్గియో గోర్ నియామకం
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!
- ఓవర్‌టేకింగ్, లేన్ స్కిప్పింగ్.. డ్రోన్లతో ట్రాఫిక్ పర్యవేక్షణ..!!
- అలెర్ట్: ఫుజైరాలో భారీ వర్షాలు..వాటర్ ఫాల్స్ కనువిందు..!!
- ప్రైవేట్ స్కూళ్లలో సంస్కరణలకు బహ్రెయిన్ శ్రీకారం..!!
- షురా కౌన్సిల్ ను సందర్శించిన భారత ప్రతినిధి బృందం..!!
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్