అక్టోబరులో షిరిడీ ఎయిర్‌పోర్టు ప్రారంభం..

- July 14, 2016 , by Maagulf
అక్టోబరులో షిరిడీ ఎయిర్‌పోర్టు ప్రారంభం..

మహారాష్ట్రలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన షిరిడీలో నిర్మిస్తున్న ఎయిర్‌పోర్టును వచ్చే అక్టోబర్‌లో ప్రారంభించనున్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోదీని రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ త్వరలో ఆహ్వానిస్తారని మహారాష్ట్ర ఎయిర్‌పోర్టు డెవలప్‌మెంట్‌ అథారిటీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ విశ్వాస్‌ పాటిల్‌ తెలిపారు.
బుధవారం ఎయిర్‌పోర్టును సందర్శించి అక్కడ జరుగుతున్న పనులను పర్యవేక్షించిన అనంతరం ఉన్నతాధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. 900 ఎకరాల్లో నిర్మిస్తున్న ఎయిర్‌పోర్టుకు ఇప్పటి వరకు రూ.225 కోట్లను ఖర్చు చేశామని, ఇంకా వంద కోట్ల పనులు పెండింగ్‌లో ఉన్నట్లు పేర్కొన్నారు. యూకే, సింగపూర్‌, దుబాయ్‌లతో పాటు ప్రపంచంలోని పలు దేశాల నుంచి వచ్చే యాత్రికులు దిల్లీ, ముంబయి విమానాశ్రయాల ద్వారా నేరుగా షిరిడీ చేరుకోవచ్చని ఆయన తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com