రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తికి BD9,400 పరిహారం: కోర్టు

- July 05, 2025 , by Maagulf
రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తికి BD9,400 పరిహారం: కోర్టు

మనామా: బహ్రెయిన్ రోడ్డు దాటుతుండగా ఓ వాహనం ఢీకొన్న తర్వాత అతనికి BD9,400 పరిహారం పెంచుతూ కోర్టు తీర్పునిచ్చింది.  ఆ వ్యక్తి రిఫాలో రోడ్డుపైకి అడుగు పెడుతుండగా, డ్రైవర్ అతన్ని గుర్తించలేక ఢీకొన్నాడు. ఇందులో అతను తీవ్రంగా గాయపడ్డాడు.  వైద్యులు అతని శాశ్వత వైకల్యాన్ని 15 శాతంగా లెక్కగట్టారు.  

అప్పీల్స్ కోర్టు గతంలో BD8,900 మొత్తాన్ని బాధితుడికి చెల్లించాలని ఆదేశించింది.దీనిపై  డ్రైవర్ కారును కవర్ చేసిన బీమా సంస్థ మొదటి తీర్పును సవాలు చేసింది. అయితే, ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదికను పరిశీలించిన కోర్టు..నుదిటిలో విరిగిన ఎముక, తలపై గాయం, ఛాతీపై గాయాలు, పగిలిన పక్కటెముకలు, ఎడమ మోకాలికి దెబ్బ, పై చేయి విరిగిపోవడం వల్ల అతనికి కదలిక తగ్గిందని దాంతో అతడు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నట్లు కోర్టు నిర్ధారించింది. దిగువ కోర్టు శారీరక హాని, మానసిక క్షోభకు BD8,500, అతని చిన్న కొడుకుకు కలిగిన బాధకు BD400 చెల్లించాలని ఆదేశించింది. వైద్య ప్యానెల్‌కు BD90 , చట్టపరమైన రుసుములలో BD100 అదనంగా చెల్లించాలని బీమా సంస్థను ఆదేశించింది.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com