AI ఫెడరల్ ప్రభుత్వ ప్రణాళికను ప్రకటించిన షేక్ మొహమ్మద్..!!

- July 07, 2025 , by Maagulf
AI ఫెడరల్ ప్రభుత్వ ప్రణాళికను ప్రకటించిన షేక్ మొహమ్మద్..!!

యూఏఈ: యూఏఈ ఫెడరల్ గవర్నమెంట్ స్ట్రాటజిక్ ప్లాన్ 2031ని ప్రారంభించింది. ఇది ప్రభుత్వ వనరుల నిర్వహణను మెరుగుపరచడానికి AIని ఉపయోగించడంపై దృష్టి పెడుతుందని తెలిపారు.  ఈ ప్రణాళిక తెలివైన, వేగవంతమైన, మరింత సమర్థవంతమైన ప్రభుత్వాన్ని సృష్టించడంలో సహాయపడుతుంది అని యూఏఈ ఉపాధ్యక్షుడు,  ప్రధాన మంత్రి మరియు దుబాయ్ పాలకుడు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ అన్నారు. అభివృద్ధి చెందుతున్న పరిశ్రమ ప్రమాణాలకు అనుగుణంగా యూఏఈ  వివిధ రంగాలలో తాజా సాంకేతికతను స్వీకరిస్తుందని స్పష్టం చేశారు.  AI సజావుగా సేవను అందించేందుకు సహాయపడుతుందని  పేర్కొన్నారు.
కృత్రిమ మేధస్సు ఇప్పటికే ఎమిరేట్స్ ప్రభుత్వంలో భాగంగా ఉందని, ఇప్పటికే పలు రంగాల్లో ఈ సాంకేతికతను ఉపయోగిస్తున్నారని తెలిపారు. పౌరులు, నివాసితులపై చట్టాల ప్రభావాన్ని అంచనా వేయడానికి పెద్ద ఎత్తున డేటాను పొందడానికి దేశం AIని ఉపయోగిస్తోందన్నారు.   గత నెలలో నేషనల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్ పై క్యాబినెట్, మినిస్టీరియల్ డెవలప్మెంట్ కౌన్సిల్,  ఫెడరల్ ఎంటిటీలు, ప్రభుత్వ కంపెనీల అన్ని డైరెక్టర్ల బోర్డులలో చర్చించాలని, జనవరి 2026 నుండి దీనిని ప్రారంభించనున్నట్లు తెలిపారు.  కిండర్ గార్టెన్ నుండి ప్రభుత్వ పాఠశాలల్లో AI ని బోధించిన మొదటి దేశాలలో యూఏఈ కూడా ఒకటని గుర్తుచేశారు.  

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com