జైపూర్-దుబాయ్ ఫ్లైట్ 9 గంటల ఆలస్యం..ప్రయాణికులు ఆగ్రహం..!!

- July 14, 2025 , by Maagulf
జైపూర్-దుబాయ్ ఫ్లైట్ 9 గంటల ఆలస్యం..ప్రయాణికులు ఆగ్రహం..!!

దుబాయ్: జైపూర్-దుబాయ్ విమాన ప్రయాణికులు తొమ్మిది గంటల వరకు ఆలస్యాన్ని ఎదుర్కొన్నారు.  సకాలంలో అప్డేట్ లను అందించడంలో విమానయాన సంస్థ ఘోరంగా విఫలమైందని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఆదివారం (జూలై 13), జైపూర్ నుండి దుబాయ్‌కు వెళ్లే స్పైస్‌జెట్ SG 57 షెడ్యూల్ ప్రకారం ఉదయం 9.30 గంటలకు టేకాఫ్ కావల్సింది. టెక్నికల్ సమస్యల కారణంగా చివరకు సాయంత్రం 6.22 గంటలకు IST బయలుదేరింది.  విమాన ట్రాకింగ్ డేటా ప్రకారం.. సాంకేతిక సమస్య కారణంగా దుబాయ్‌లో ఆలస్యంగా వచ్చిన ఇన్‌బౌండ్ విమానం (SG 58) దీనికి కారణమని విమానాశ్రయ అధికారులు తెలిపారు.  

మొదట యూఏఈ సమయం ప్రకారం తెల్లవారుజామున 3.40 గంటలకు దుబాయ్ నుండి బయలుదేరాల్సిన SG 58 చివరకు మధ్యాహ్నం 12.19 గంటలకు బయలుదేరి జైపూర్‌లో 5.34 గంటలకు ల్యాండ్ అయింది. కానీ, కరెంట్  కమ్యూనికేషన్ లేకపోవడంతో ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.  "గంటల తరబడి ఎటువంటి సమాచారం లేదు. మేము గేట్ వద్ద వేచి ఉన్నాము" అని తన కుటుంబంతో ప్రయాణిస్తున్న షార్జా నివాసి ఎస్. పర్మార్ అన్నారు.  

జైపూర్ నుండి దుబాయ్‌కు వెళ్లే ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం IX-195 శనివారం దాదాపు ఆరు గంటలు ఆలస్యం అయిన ఒక రోజు తర్వాత ఈ దుర్ఘటన జరగడం గమనార్హం. ఈ కేసులో ఇన్‌బౌండ్ విమానం సమయానికి వచ్చినప్పటికీ, వెళ్లాల్సిన విమానం 6 గంటల ఆలస్యం కావడంపై ప్రయాణికులు మండిపడ్డారు. అలాగే, జూలై 8న, స్పైస్‌జెట్ SG 57 కూడా ఆలస్యానికి గురై, షెడ్యూల్ కంటే ఏడు గంటలు ఆలస్యంగా బయలుదేరింది.  మరో స్పైస్‌జెట్ SG 59 దుబాయ్‌కు ఆదివారం 11 గంటలు ఆలస్యంగా బయలుదేరింది.  దీనివల్ల ప్రయాణికులు, సిబ్బంది మధ్య తీవ్ర ఘర్షణలు చెలరేగింది. ఈ ఘటనకు సంబంధించి వైరల్ అయిన వీడియోలలో ప్రయాణికులు టెర్మినల్ ఫ్లోర్‌లో కూర్చుని నినాదాలు చేశారు. తాగేందుకు కనీసం మంచినీరు కూడా ఇవ్వలేదని విమానయాన సంస్థకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేయడం కలకలం సృష్టించింది.    

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com