సౌదీలో మ్యూజిక్, సినిమా, ఆర్ట్స్ విభాగాలకు ప్రోత్సాహం..!!

- July 16, 2025 , by Maagulf
సౌదీలో మ్యూజిక్, సినిమా, ఆర్ట్స్ విభాగాలకు ప్రోత్సాహం..!!

రియాద్: మ్యూజిక్, సినిమా, థియేటర్, ఆర్ట్స్ విభాగాలకు సంబంధించిన విద్యా కార్యక్రమాలను విస్తృతం చేయాలని షురా కౌన్సిల్ సాంస్కృతిక మంత్రిత్వ శాఖను కోరింది.  కౌన్సిల్ తన 39వ రెగ్యులర్ సెషన్‌లో ఈ మేరకు నిర్ణయించారు. పురావస్తు ఆవిష్కరణలను ప్రతిబింబించేలా నేషనల్ మ్యూజియంలోని ప్రదర్శనలను అప్‌గ్రేడ్ చేయాలని మ్యూజియం కమిషన్‌ కు సూచించింది.  దేశీయ నాటకరంగ కార్యకలాపాలను ప్రోత్సహించడానికి విద్యా మంత్రిత్వ శాఖతో సమన్వయంతో వెళ్లాలని తెలిపింది. 

ప్రభుత్వ , ప్రైవేట్ మానసిక ఆరోగ్య సమస్యలతో పోరాడుతున్న వారికి సేవలు అందించడానికి వీలుగా మానసిక సంప్రదింపు యాప్‌లను పర్యవేక్షించాలని జాతీయ స్థాయిలో ఒక సంస్థను ఏర్పాటు చేయాలని నేషనల్ సెంటర్ ఫర్ మెంటల్ హెల్త్ ప్రమోషన్‌ను కోరింది. క్రీడలపై, కౌన్సిల్ స్పోర్ట్స్ బౌలేవార్డ్ ఫౌండేషన్‌ను క్యాబినెట్ రిపోర్టింగ్ మార్గదర్శకాలను పాటించాలని, దాని సౌకర్యాలలో సేవలను మెరుగుపరచాలని కోరింది. హెల్త్ టిప్స్ పేరిట సోషల్ మీడియాలో వైరలవుతున్న కంటెంట్‌ పై పర్యవేక్షణ ఉండాలని, సామాజిక వేదికలపై హెల్త్ కంటెంట్‌ను కఠినంగా పర్యవేక్షించాలని, ఆరోగ్య సంరక్షణ నిపుణుల కోసం కొత్త నియంత్రణ చట్టాలను తయారు చేయాలని సూచించింది.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com