150 దేశాల పై ప్రతీకార సుంకాలు: డొనాల్డ్ ట్రంప్
- July 17, 2025
అమెరికా: ప్రతీకార సుంకాలతో ప్రపంచ దేశాల పై విరుచుకుపడుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన నిర్ణయం తీసుకున్నారు.150కి పైగా దేశాలపై 10 లేదా 15 శాతం సుంకాలు విధించనున్నట్లు ప్రకటించారు.ఈమేరకు ఆయా దేశాలకు సుంకాల రేట్లు తెలియజేస్తూ లేఖలు పంపనున్నట్లు వెల్లడించారు.150కి పైగా దేశాలకు నోటీసులు పంపించనున్నామని, అందులోనే సుంకం రేటు పేర్కొంటామని చెప్పారు. ఈ దేశాలన్నింటికీ ఒకే విధంగా సుంకాలుఉంటాయని వ్యాఖ్యానించారు.అవన్నీ పెద్ద దేశాలు కాదని, తమతో అంతగా వ్యాపారం చేయవని పేర్కొన్నారు.ఈ సుంకాలు 10 లేదా 15 శాతం ఉండే అవకాశం ఉందని చెప్పారు.
ఆర్థికపరమైన ఆంక్షల
మరోవైపు రష్యాతో వాణిజ్యం దేశాల పై 500 శాతం సుంకాలు విధిస్తామని అమెరికా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఓ బిల్లును కూడా తీసుకురానున్నట్లు రిపబ్లికన్ సెనేటర్ లిండ్సే గ్రాహం ఇటీవల తెలిపారు. ఇదేవిధమైన ప్రకటన నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రూట్ చేశారు. రష్యాతో వ్యాపారం కొనసాగించే దేశాలు ఆర్థికపరమైన ఆంక్షలను ఎదుర్కోవలసి వస్తుందని భారత్, చైనా, బ్రెజిల్‌ని హెచ్చరించారు. రష్యా నుంచి చమురు, సహజ వాయువు దిగుమతి చేసుకుంటున్న దేశాలపై అదనంగా 100 శాతం ఆంక్షలు విధిస్తామని ఆయన హెచ్చరించారు. ‘మీరు భారత ప్రధాని అయినా, చైనా అధ్యక్షుడు అయినా లేక బ్రెజిల్ అధ్యక్షుడు అయినా..రష్యాతో వాణిజ్యం ఇంకా కొనసాగిస్తూ వారి చమురు, గ్యాస్‌ని కొనుగోలు చేస్తుంటే మీపై అదనంగా 100 శాతం ఆంక్షలు విధిస్తాను’ అంటూ రూట్ ప్రకటించారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైఖరి మారిన నేపథ్యంలో నాటో ప్రధాన కార్యదర్శి నుంచి ఈ హెచ్చరికలు జారీకావడం గమనార్హం. ఈ మూడు దేశాల నాయకులు శాంతి చర్చలపై దృష్టి కేంద్రీకరించాలని రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై ఒత్తిడి తీసుకురావాలని ఆయన కోరారు.
శాంతి చర్చలకు
తాను చేస్తున్న హెచ్చరికను ఈ మూడు దేశాల నాయకులు పరిగణనలోకి తీసుకోని పక్షంలో తీవ్రంగా నష్టపోతారని కూడా ఆయన హెచ్చరించారు.శాంతి చర్చలకు కట్టుబడి ఉండాలని పుతిన్‌ని ప్రత్యక్షంగా పిలుపునివ్వాలని మూడు దేశాల నాయకులను ఆయన కోరారు. శాంతి చర్చలను సీరియస్‌గా తీసుకోవాలని పుతిన్‌కి ఫోన్ చేసి నేరుగా చెప్పాలని ఆయన తెలిపారు. అలా చేయకపోతే భారత్, బ్రెజిల్, చైనా భారీస్థాయిలో దెబ్బ తింటాయని ఆయన చెప్పారు. కాగా, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటున్న దేశాలపై భారీ స్థాయిలో సుంకాలు విధిస్తామని ఇటీవలే ప్రకటించారు. అంతేగాక ఉక్రెయిన్‌తో 50 రోజుల్లో కాల్పుల విరమణ ఒప్పందం చేసుకోకపోతే రష్యా ఎగుమతులపై 100 శాతం సుంకాలు విధిస్తామని కూడా ట్రంప్ హెచ్చరించారు.
సుంకాలు ద్రవ్యోల్బణానికి కారణమాయా?
జూన్‌లో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాలు కొన్ని వస్తువుల ధరలను పెంచడం ప్రారంభించడంతో ద్రవ్యోల్బణం పెరిగింది , ఇది ఫెడరల్ రిజర్వ్ చైర్ జెరోమ్ పావెల్‌పై వడ్డీ రేట్లను తగ్గించమని ఒత్తిడి చేయడానికి ఆయన చేసిన ప్రయత్నాలను దెబ్బతీసింది.
ద్రవ్యోల్బణం ఎంత పెరిగింది?
గత 12 నెలల్లో, మే నెలలో మొత్తం వార్షిక ద్రవ్యోల్బణం రేటు 2.4 శాతానికి చేరుకుంది, ఇది గత నెల 2.3 శాతం రేటు నుండి పెరిగింది, ఇది ఫిబ్రవరి 2021 తర్వాత అత్యల్ప స్థాయి అని BLS యొక్క CPI నివేదిక చూపించింది. ఆహారం మరియు శక్తి మినహా, “కోర్” ధరలు వరుసగా మూడవ నెల కూడా ఒక సంవత్సరం క్రితం నుండి 2.8 శాతం పెరిగాయి.
ఇటీవల ఏ దేశం ఎక్కువ డబ్బును ముద్రించింది?
జింబాబ్వేలో అధిక ద్రవ్యోల్బణం 2008 నవంబర్ మధ్యలో సంవత్సరానికి శాతం.ఆ సమయంలో, $100 ట్రిలియన్ బిల్లు సాధారణ బస్సు ఛార్జీని చెల్లించలేకపోయింది.ఏప్రిల్ 2009లో, జింబాబ్వే తన కరెన్సీని ముద్రించడం ఆపివేసింది మరియు ఇతర దేశాల కరెన్సీలను ఉపయోగించారు.
తాజా వార్తలు
- భారత్‌కు అమెరికా కొత్త రాయబారిగా సెర్గియో గోర్ నియామకం
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!
- ఓవర్‌టేకింగ్, లేన్ స్కిప్పింగ్.. డ్రోన్లతో ట్రాఫిక్ పర్యవేక్షణ..!!
- అలెర్ట్: ఫుజైరాలో భారీ వర్షాలు..వాటర్ ఫాల్స్ కనువిందు..!!
- ప్రైవేట్ స్కూళ్లలో సంస్కరణలకు బహ్రెయిన్ శ్రీకారం..!!
- షురా కౌన్సిల్ ను సందర్శించిన భారత ప్రతినిధి బృందం..!!
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్