నాణ్యత లేని ఉత్పత్తుల విక్రయం..భారీ జరిమానా,మూసివేత..!!
- July 18, 2025
రియాద్: నాణ్యత లేని విద్యుత్ ఉత్పత్తులను కలిగి ఉండటం, విక్రయించడం ద్వారా వాణిజ్య నిరోధక మోస చట్టాన్ని ఉల్లంఘించిన కేసులో ఫైనల్ కోర్టు తీర్పు ప్రకటించింది. సదరు సంస్థను మూసివేయడంతోపాటు భారీ జరిమానా విధించింది.
ఖమిస్ ముషాయిత్‌లో మంత్రిత్వ శాఖ తనిఖీ బృందాలు సాధారణ తనిఖీల్లో సంస్థలో అమ్మకానికి పెట్టిన వస్తువులు నాణ్యంగా లేవని నిర్ధారించారు. అసిర్ ప్రాంతంలోని అప్పీళ్ల కోర్టు ఫైనల్ తీర్పులో ఆర్థిక జరిమానా విధించింది. అలాగే, వ్యాపారాన్ని మూడు రోజుల పాటు మూసివేయాలని ఆదేశించింది. మోసపూరిత వస్తువులను జప్తు చేసి నాశనం చేయాలని ఆదేశించింది.
చట్టాన్ని అమలు చేయడానికి, ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవడానికి మంత్రిత్వ శాఖ తన నిబద్ధతను పునరుద్ఘాటించింది. వాణిజ్య మోస నిరోధక చట్టం కింద జరిమానాలలో నేరస్థుల బహిరంగ పేర్లను ప్రకటించడంతో పాటు మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష, SR1 మిలియన్ వరకు జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉందని తెలిపింది.
తాజా వార్తలు
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!
- సౌదీలో అక్రమ డ్రైవర్ల పై ఉక్కుపాదం..!!
- సెప్టెంబర్‌లో ఖతార్ కు పోటెత్తిన ప్యాసింజర్స్..!!
- స్వీట్లు తినిపించి పిల్లల గొంతుకోసి చంపిన తండ్రి
- షార్జాలో జైవాకర్ల పై కఠిన చర్యలు..!!
- యూరప్‌కు వెళుతున్నారా? అమల్లోకి వచ్చిన న్యూ రూల్స్..!!
- BHD 52,000 VAT ఎగవేతపై దర్యాప్తు పూర్తి..!!
- భారత్‌కు అమెరికా కొత్త రాయబారిగా సెర్గియో గోర్ నియామకం
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!