ట్యాక్స్ పారదర్శకతలో ఒమన్ కు మెరుగైన రేటింగ్..!!

- July 18, 2025 , by Maagulf
ట్యాక్స్ పారదర్శకతలో ఒమన్ కు మెరుగైన రేటింగ్..!!

మస్కట్: ఒమన్ సుల్తానేట్ పారదర్శకత, పన్ను సమాచార మార్పిడిలో అంతర్జాతీయ ప్రమాణాలకు "ఎక్కువగా అనుగుణంగా" ఉందని రేటింగ్ దక్కింది. ఈ సానుకూల దృక్పథం ఒమన్ తన పన్ను వ్యవస్థ పారదర్శకతను పెంచడంలో సాధించిన అద్భుతమైన పురోగతిని ప్రతిబింబిస్తుంది. ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కో-ఆపరేషన్ అండ్ డెవలప్‌మెంట్ (OECD) గ్లోబల్ ఫోరమ్ నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా.. ఒమన్ సుల్తానేట్ పారదర్శకత అవసరాలకు అనుగుణంగా ఉందని, అభ్యర్థనపై పన్ను సమాచార మార్పిడిపై సమగ్ర సమీక్ష ఆధారంగా ఈ నిర్ణయం తీసుకుందని తెలిపారు.  ఈ ఉన్నత ర్యాంకింగ్, పారదర్శకత, పాలన సూత్రాలను స్థాపించడానికి, దేశ పన్ను వ్యవస్థపై అంతర్జాతీయ విశ్వాసాన్ని పెంపొందించడానికి ఒమన్ నిరంతర నిబద్ధతను ప్రతిబింబిస్తుందన్నారు.    

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com