ముత్తన్న కాంప్లెక్స్ అద్దెదారులకు జూలై 30వరకు గడువు..!!
- July 19, 2025
కువైట్: ముత్తన్న కాంప్లెక్స్ నిర్వహణ సంస్థ పంపిన నోటీసు ప్రకారం..జూలై 30 నాటికి ముత్తన్న కాంప్లెక్స్‌లోని అందరూ టెనంట్స్ ఖాళీ చేయాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ కోరింది. లీజుకు తీసుకున్న స్థలాలను అప్పగించాలని సూచించింది. అద్దెదారులు నిర్వహణ సంస్థతో సమన్వయం చేసుకోవాలన్నారు.
భాగస్వామ్య చట్టం ప్రకారం ముత్తన్న కాంప్లెక్స్‌ను బహిరంగ వేలం కోసం ఆమోదించిన ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్య ప్రాజెక్టుల ఉన్నత కమిటీ నిర్ణయాన్ని అనుసరించి ఈ చర్య తీసుకున్నారు. వాణిజ్య, నివాస యూనిట్లతో సహా మొత్తం కాంప్లెక్స్‌ను 30 రోజుల్లోపు ఖాళీ చేయాలి. అయితే, తొలగింపు నోటీసు చట్టవిరుద్ధం కావచ్చని న్యాయ నిపుణులు అంటున్నారు. సరైన తొలగింపుకు కూల్చివేత అనుమతి, అద్దెదారులకు ఆరు నెలల గ్రేస్ పీరియడ్ అవసరమని పేర్కొన్నారు. పునరుద్ధరణ పనుల కోసం, తరలింపు అవసరం లేదని వారువాధిస్తున్నారు.
మరోవైపు పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్య అథారిటీ ముత్తన్న కాంప్లెక్స్ ప్రాజెక్ట్ అభివృద్ధి, నిర్వహణ, కార్యకలాపాల కోసం నంబర్ 2/2025 కోసం బిడ్లను ఆహ్వానించింది.
తాజా వార్తలు
- మహిళా ఫార్ములా 4 రేసర్
- మిసెస్ యూనివర్స్ 2025 గా భారత మహిళ
- జపాన్‌లో శాశ్వత నివాసానికి గోల్డెన్ ఛాన్స్!
- Gitex 2025: స్మార్ట్ కార్లు వీసా ఉల్లంఘనలు గుర్తింపు..!!
- వాడివేడిగా బహ్రెయిన్ పార్లమెంట్ సమావేశాలు..!!
- వెండింగ్ యంత్రాల ద్వారా మెడిసిన్ అమ్మకాలపై కీలక నిర్ణయం..!!
- ఒమన్ లో కార్మికుల రక్షణకు కొత్త నిబంధనలు..!!
- సౌదీ అరేబియాలో కొత్తగా 1,516 పురావస్తు ప్రదేశాలు..!!
- నవంబర్ 4 నుంచి ఖతార్ లో బాస్కెట్‌బాల్ మినీ వరల్డ్ కప్..!!
- ఏపీ సమాచార శాఖ కమిషనర్‌గా కె.ఎస్.విశ్వనాథన్