2 రోజుల్లో 4 దేశాలను సందర్శించిన యూఏఈ ప్రెసిడెంట్..!!

- July 19, 2025 , by Maagulf
2 రోజుల్లో 4 దేశాలను సందర్శించిన యూఏఈ ప్రెసిడెంట్..!!

యూఏఈ: యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ కేవలం రెండు రోజుల్లో నాలుగు దేశాలను సందర్శించారు. జూలై 16 నుండి 17 వరకు షేక్ మొహమ్మద్ టర్కీ, అల్బేనియా, సెర్బియా, హంగేరీలోని నాయకులను కలిశారు.  ఈ సందర్భంగా ఆయా దేశాలతో కీలక ఒప్పందాలను కుదుర్చుకున్నారు. వాటిల్లో ముఖ్యంగా ఇంధనం, వాణిజ్యం, ఆహార భద్రత,  దౌత్యం వంటి రంగాలలో వ్యూహాత్మక భాగస్వామ్యాలను ఏర్పచుకున్నారు.

అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ దౌత్య పర్యటన టర్కీలో ప్రారంభమైంది.  అక్కడ ఆయనకు అంకారాలోని అధ్యక్ష భవనంలో టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగన్ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా యూఏఈ-టర్కీ మధ్య సహకారాన్ని బలోపేతం చేయడానికి ఉద్దేశించిన అనేక ప్రధాన ఒప్పందాలను కుదుర్చుకున్నారు.  ఆ తర్వాత అల్బేనియాలోని టిరానాకు చేరుకున్నారు.  అక్కడ ఆయన ప్రధాన మంత్రి ఎడి రామతో చర్చలు జరిపారు. ఇంధనం, సాంకేతికత, ఆహార భద్రత, ఆర్థిక అభివృద్ధిలో సహకారంపై ఇద్దరు నాయకులు చర్చించారు.

జూలై 17న బెల్‌గ్రేడ్ చేరుకున్న షేక్ మొహమ్మద్.. సెర్బియా అధ్యక్షుడు అలెగ్జాండర్ వుసిక్‌ను కలిశారు. మే 2025లో అమల్లోకి వచ్చిన వారి సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం కింద సంబంధాలను పెంపొందించడంపై సమీక్షించారు. పెట్టుబడులు, ఆర్థిక వ్యవస్థ, వాణిజ్యం, సాంకేతికత, ఆహార భద్రత, పునరుత్పాదక ఇంధనం తదితర అంశాలపై చర్చించారు.  అదే రోజు హంగేరియన్ ప్రధాన మంత్రి విక్టర్ ఓర్బన్‌తో చర్చల కోసం షేక్ మొహమ్మద్ బుడాపెస్ట్‌లో అడుగుపెట్టారు. చర్చలు మౌలిక సదుపాయాలు, పునరుత్పాదక ఇంధనం, సాంకేతికతలో సహకారంపై చర్చించారు.  హంగేరియన్ పార్లమెంట్ భవనాన్ని సందర్శించారు.      

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com