ప్రపంచ డ్రగ్ నెట్వర్క్ను ఛేదించిన షార్జా పోలీసులు..!!
- July 19, 2025
యూఏఈ: షార్జా పోలీసులు అంతర్జాతీయ మాదకద్రవ్య అక్రమ రవాణా కార్యకలాపాలను అడ్డుకున్నారు. తన భార్య, పిల్లలను ముసుగుగా ఉపయోగించిన వ్యక్తిని అరెస్టు చేశారు. కెనడా, స్పెయిన్ నుండి యూఏఈలోకి మాదకద్రవ్యాలను అక్రమంగా రవాణా చేస్తున్న అంతర్జాతీయ నేరస్థుల నెట్వర్క్ను నిర్మూలించడంలో భాగంగా చేపట్టిన ఆపరేషన్ సందర్భంగా డ్రగ్ నెట్ వర్క్ ను పోలీసులు ఛేదించారు.
అధికారులు 131 కిలోల మాదకద్రవ్యాలు, సైకోట్రోపిక్ పదార్థాలతో కూడిన భారీ సముద్ర రవాణాతో పాటు, 5.35 మిలియన్ల Dhrh విలువైన 9,945 మాదకద్రవ్య పిల్స్ ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆపరేషన్లో ఏడుగురు అనుమానితులను అరెస్టు చేశారు. వీరిలో తన నేర కార్యకలాపాలను కప్పిపుచ్చడానికి కుటుంబ సభ్యుడిగా వ్యవహరించిన కీలక అరబ్ నిందితుడు కూడా ఉన్నాడని అధికారులు తెలిపారు.
కెనడాలోని టొరంటో పోర్ట్ నుండి స్పెయిన్లోని మలగా వరకు, చివరడి యూఏఈ పోర్ట్ వరకు విస్తరించి ఉన్న అధునాతన స్మగ్లింగ్ మార్గాన్ని కూడా అధికారులు గుర్తించారు. అక్కడ కారు విడిభాగాల కంటైనర్లో దాచిన షిప్మెంట్ను సీజ్ చేశారు. అనుమానితులను న్యాయ అధికారులకు అప్పగించినట్లు తెలిపారు.
తాజా వార్తలు
- మిసెస్ యూనివర్స్ 2025 గా భారత మహిళ
- జపాన్లో శాశ్వత నివాసానికి గోల్డెన్ ఛాన్స్!
- Gitex 2025: స్మార్ట్ కార్లు వీసా ఉల్లంఘనలు గుర్తింపు..!!
- వాడివేడిగా బహ్రెయిన్ పార్లమెంట్ సమావేశాలు..!!
- వెండింగ్ యంత్రాల ద్వారా మెడిసిన్ అమ్మకాలపై కీలక నిర్ణయం..!!
- ఒమన్ లో కార్మికుల రక్షణకు కొత్త నిబంధనలు..!!
- సౌదీ అరేబియాలో కొత్తగా 1,516 పురావస్తు ప్రదేశాలు..!!
- నవంబర్ 4 నుంచి ఖతార్ లో బాస్కెట్బాల్ మినీ వరల్డ్ కప్..!!
- ఏపీ సమాచార శాఖ కమిషనర్గా కె.ఎస్.విశ్వనాథన్
- హైదరాబాద్లో సేఫ్ రైడ్ ఛాలెంజ్ ప్రారంభం