దుబాయ్ లో ఫేక్ పోలీస్ అధికారికి జైలుశిక్ష..!!
- July 19, 2025
యూఏఈ: ఆసియన్ వ్యక్తి నుండి 45,000 దిర్హామ్‌లను దొంగిలించడానికి ప్రయత్నించిన నకిలీ పోలీస్ అధికారికి దుబాయ్ క్రిమినల్ కోర్టు మూడు నెలల జైలు శిక్ష విధించింది. 45 ఏళ్ల గల్ఫ్ జాతీయుడు నైఫ్ ప్రాంతంలోని కరెన్సీ ఎక్స్ఛేంజ్ సమీపంలో బాధితుడిని దోచుకోవడానికి ప్రయత్నించాడు ఈ సంఘటన ఏప్రిల్‌లో జరిగింది. బాధితుడు 45,000 దిర్హామ్‌లను యూఎస్ డాలర్లుగా మార్చడానికి కరెన్సీ ఎక్స్ఛేంజ్‌ను సందర్శించాడు. కానీ తక్కువ రేటు కారణంగా ముందుకు వెళ్లవద్దని నిర్ణయించుకున్నాడు.
కేసు రికార్డుల ప్రకారం.. అతను ప్రాంగణం నుండి బయటకు రాగానే, నిందితుడు, ఇతరులు పోలసు అధికారులమని తన బ్యాగ్‌ను తీసుకోవడానికి ప్రయత్నించారని బాధితుడు దర్యాప్తు సంస్థలకు చెప్పాడు. దుబాయ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సంబంధిత వాహనాన్ని గుర్తించారు. ఒక పిల్లల పేరుతో నమోదు చేయబడినప్పటికీ, కారు నిందితుడి సోదరుడి ఆధీనంలో ఉందని గుర్తించారు.
తాజా వార్తలు
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!







