గాజా పై ఇజ్రాయెల్ దాడి..85 మంది మృతి

- July 21, 2025 , by Maagulf
గాజా పై ఇజ్రాయెల్ దాడి..85 మంది మృతి

ఇజ్రాయెల్, హామాస్ల మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది.ఇప్పటికే గాజాప్రాంతమంతా అతలాకుతలమైపోయింది.అక్కడి ప్రజల జీవనవిధానంకడుదయనీయంగా మారింది. ప్రపంచదేశాలు, ఐక్యరాజ్యసమితి నిత్యంఖండిస్తున్నా ఇజ్రాయెల్ నేత నేతన్యాహు మాత్రం తన మొండివైఖరినివిడనాడడం లేదు.తాజాగా ఇజ్రాయెల్ సైనికులు ఆహారం కోసం వేసి చూస్తున్న గాజా పాలస్తీనియన్ల పై భీకరదాడికి పాల్పడ్డారు.ఈ దాడుల్లో 85 మంది మృతి చెందారు. జికింమీదుగా ఉత్తర గాజాలోకి వెళ్లే ఆహార ట్రక్కుల కోసం ఎదురుచూస్తున్న వారిపై దాడి చేశారు.

గాయపడిన వారిలో 150 మంది పరిస్థితి విషమంగా ఉంది
85 మంది మృతి చెందడంతో పాటు 150 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.గాయపడిన వారిలో పలువురి ఆరోగ్యం విషమంగా ఉంది. ఇజ్రాయెల్ సైనికులేజరిపారని ప్రత్యక్షసాక్షులు చెప్పారు.ఈ కాల్పులుగాజాపై దాడులు కొనసాగుతాయి. నెతన్యాహుకాగా గాజాపై తమ దాడులు ఆగవని, తమబంధీలను విడుదల చేసేంతవరకుపోరాటం కొనసాగుతూ ఉంటుందని ఇజ్రాయేల్ ప్రధాని నెతన్యాహువెల్లడించారు. గాజా పట్టణాన్ని పూర్తిగా తమ అధీనంలో తెచ్చుకోవడమే తమ లక్ష్యమని తెలిపారు.ట్రంప్ రెండు దేశాలమధ్య యుద్ధం ఆపేందుకు చేస్తున్నయత్నాలు ఫలించడం లేదు. ఇజ్రాయెల్ ఇరాన్ల మధ్య యుద్ధం కొనసాగింది.ప్రస్తుతం రెండు దేశాలు కాల్పుల ఒప్పందంలో కొనసాగుతున్నాయి.

ఇజ్రాయెల్ ఎక్కడ ఉంది?
ఇజ్రాయెల్ పశ్చిమ ఆసియాలో, మధ్యప్రాచ్యంలో ఉంది.ఇది భూమధ్యరేఖ సమీపంలో ఉన్న దేశం. ఉత్తరాన లెబనాన్, తూర్పున సిరియా, జోర్డాన్, దక్షిణాన ఈజిప్ట్, పశ్చిమాన మధ్యధరా సముద్రం ఉన్నవి.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com