జ్యురిక్ విమానాశ్రయంలో ‘ఎమిరేట్స్’ ప్రయాణికులకు కాళరాత్రి..!!

- July 21, 2025 , by Maagulf
జ్యురిక్ విమానాశ్రయంలో ‘ఎమిరేట్స్’ ప్రయాణికులకు కాళరాత్రి..!!

యూఏఈ: జులై 19న రాత్రి సమయంలో దుబాయ్‌కు వెళ్లే ఎమిరేట్స్ విమానం EK086లో టెక్నికల్ సమస్యలు తలెత్తాయి. దీంతో కొంతమంది ప్రయాణికులు తమ విమానం సాంకేతిక సమస్య కారణంగా ఆలస్యం కావడంతో జ్యూరిచ్ విమానాశ్రయంలో అనేక సవాళ్లను ఎదుర్కొన్నారు.  300 మంది ప్రయాణికులలో కొందరికి హోటల్ వసతి కల్పించగా, సింగిల్-ఎంట్రీ స్కెంజెన్ వీసాలు ఉన్నవారు, విమానాశ్రయ టెర్మినల్ నుండి బయటకు వెళ్లలేకపోయారు. చాలా విమానాశ్రయ సౌకర్యాలు, రెస్టారెంట్లు రాత్రి 11 గంటలకు మూసివేయడంతో దాదాపు 20 మంది ప్రయాణికులు ఆహారం, సరైన విశ్రాంతి సౌకర్యాలు, సరైన సమాచారం కోసం గంటలపాటు వేచిచూడాల్సిన దుస్థితి ఏర్పడింది.   

దుబాయ్‌కు చెందిన ఇరానియన్ ప్రవాసిని నెగిన్ జాఫారి తన స్నేహితురాలు సనాజ్‌తో యూరోపియన్ వేసవి హాలిడేస్ కోసం బుక్ చేసుకున్నారు. జ్యురిక్ విమానాశ్రయంలో 20 గంటలకు పైగా గడిపిన తర్వాత వారు నిరాశతో వెనుదిరారు . “రాత్రి 11 గంటల ప్రాంతంలో, విమానాశ్రయ లైట్లు ఆగిపోవడం ప్రారంభించాయి. అందరూ గందరగోళానికి గురయ్యారు. అప్పుడే విమానం సర్వీసులు రద్దు చేసినట్ల తెలిపారు. రాత్రంగా కాళరాత్రి అయిందని పలువురు ప్యాసింజర్లు తమ సోషల్ మీడియాలో అకౌంట్లలో వెల్లడించారు.     

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com