2025 మొదటి అర్ధభాగంలో రికార్డు సృష్టించిన సౌదీ రైల్వేలు..!!

- July 22, 2025 , by Maagulf
2025 మొదటి అర్ధభాగంలో రికార్డు సృష్టించిన సౌదీ రైల్వేలు..!!

రియాద్: సౌదీ అరేబియా రైల్వేలు (SAR) 2025 మొదటి అర్ధభాగంలో రికార్డు సృష్టించాయి. ఉత్తర, తూర్పు,హరమైన్ హై-స్పీడ్ రైలు నెట్‌వర్క్‌లలో 21,000 కంటే ఎక్కువ ట్రిప్పులలో 7.93 మిలియన్ల మంది ప్రయాణికులను రవాణా చేసింది. 2024లో ఇదే కాలంతో పోలిస్తే 8% పెరుగుదల నమోదైంది. హజ్ సీజన్‌లో అసాధారణమైన సేవ ద్వారా బలమైన పనితీరు బలపడిందన్నారు.దీనిలో హరమైన్ లైన్ ద్వారా 1.2 మిలియన్ల మంది యాత్రికులు , మషైర్ మెట్రో ద్వారా 1.8 మిలియన్ల మంది ప్రయాణం చేశారు. 

అదే సమయంలో సరుకు రవాణా వైపు, SAR 14.93 మిలియన్ టన్నుల ఖనిజాలు, వస్తువులను(13శాతం పెరుగుదల) తరలించింది.తద్వారా 72 మిలియన్ లీటర్లకు పైగా ఇంధన ఆదాతోపాటు 190,000 టన్నుల కార్బన్ ఉద్గారాలను తగ్గించడం జరిగిందని SAR సీఈఓ డాక్టర్ బషర్ అల్-మాలిక్ తెలిపారు.జాతీయ పరిశ్రమలకు మద్దతు ఇస్తుందని, సౌదీ ప్రతిభకు నాణ్యమైన ఉద్యోగ అవకాశాలను సృష్టిస్తుందని పేర్కొన్నారు.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com