25 కంపెనీల ద్వారా రెసిడెన్సీ..ఫేక్ వర్క్ పర్మిట్ల స్కామ్..!!
- July 22, 2025
కువైట్: 25 కంపెనీల పేరుతో రెసిడెన్సీ స్కామ్, ఫేక్ వర్క్ పర్మిట్ల దందా భారీ ఎత్తున జరుగుతుందని అంతర్గత మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ కేసుకు సంబంధించి 25 కంపెనీల ద్వారా 56 మంది కార్మికులకు ఇలాంటి ఫేక్ సర్టిఫికేట్లను అందించినట్లు గుర్తించినట్లు తెలిపింది. ఒక కువైట్ పౌరుడు, ఒక సిరియన్, ఒక భారతీయ జాతీయుడు డబ్బులు తీసుకొని చట్టవిరుద్ధంగా రెసిడెన్సీ పర్మిట్లను అందించే నెట్ వర్క్ ను నడుపుతున్నట్లు పేర్కొంది.
జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ రెసిడెన్స్ అఫైర్స్ ఇన్వెస్టిగేషన్స్ దర్యాప్తు నిర్వహించింది. 25 కంపెనీలు, 4 సంబంధిత సంస్థలకు సంతకం చేసే అధికారం ఉన్న ఒక పౌరుడు, కార్మికులను నిజమైన ఉద్యోగాలు ఇవ్వకుండా నమోదు చేయడానికి ఈ కంపెనీలను ఉపయోగిస్తున్నట్లు అధికారులకు సమాచారం అందింది. మొత్తంగా 56 మంది కార్మికులు ఈ కంపెనీల కింద నమోదు చేయబడ్డారని, వారిలో కొందరు నివాసం లేదా వీసా నియమాలను ఉల్లంఘించారని తెలిపారు. మరికొందరు వారి పర్మిట్లలో జాబితా చేయబడిన వాటికి భిన్నమైన కంపెనీల కోసం పనిచేస్తున్నట్లు విచారణ సందర్భంగా గుర్తించినట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
ఉపాధి లేకుండానే రెసిడెన్సీ పర్మిట్లు పొందడానికి కార్మికుల నుండి 350 నుండి 1,200 కువైట్ దినార్ల వరకు వసూలు చేసినట్లు వారు తెలిపారు. ఈ డబ్బును ఇద్దరు మధ్యవర్తుల ద్వారా సేకరించినట్లు( ఒక సిరియన్, ఒక భారతీయుడు) తెలిపారు. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపింది.
తాజా వార్తలు
- భారత్కు అమెరికా కొత్త రాయబారిగా సెర్గియో గోర్ నియామకం
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!
- ఓవర్టేకింగ్, లేన్ స్కిప్పింగ్.. డ్రోన్లతో ట్రాఫిక్ పర్యవేక్షణ..!!
- అలెర్ట్: ఫుజైరాలో భారీ వర్షాలు..వాటర్ ఫాల్స్ కనువిందు..!!
- ప్రైవేట్ స్కూళ్లలో సంస్కరణలకు బహ్రెయిన్ శ్రీకారం..!!
- షురా కౌన్సిల్ ను సందర్శించిన భారత ప్రతినిధి బృందం..!!
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్