ఇజ్రాయెల్ పరిధిలోకి వెస్ట్ బ్యాంక్‌..ఖండించిన అరబ్, ఇస్లామిక్ దేశాలు..!!

- July 25, 2025 , by Maagulf
ఇజ్రాయెల్ పరిధిలోకి వెస్ట్ బ్యాంక్‌..ఖండించిన అరబ్, ఇస్లామిక్ దేశాలు..!!

రియాద్: ఆక్రమిత వెస్ట్ బ్యాంక్‌పై "ఇజ్రాయెల్ సార్వభౌమాధికారం" విధించాలని పిలుపునిస్తూ ఇజ్రాయెల్ నెస్సెట్ ఇటీవల చేసిన ప్రకటనను సౌదీ అరేబియాతోపాటు అరబ్, ఇస్లామిక్ దేశాలు తీవ్రంగా ఖండించాయి. ఇది అంతర్జాతీయ చట్టాన్ని స్పష్టంగా ఉల్లంఘించడమేనని, ఇది ఎంతమాత్రం ఆమోదయోగ్యం స్పష్టం చేశాయి. ఈ మేరకు సంయుక్తం ప్రకటనలో సౌదీ అరేబియా, బహ్రెయిన్, ఈజిప్ట్, ఇండోనేషియా, జోర్డాన్, నైజీరియా, పాలస్తీనా, ఖతార్, టర్కియే, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, లీగ్ ఆఫ్ అరబ్ స్టేట్స్, ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ స్పష్టం చేశాయి.

ఇజ్రాయెల్ చర్యను ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానాలు 242 (1967), 338 (1973), 2334 (2016) తీర్మానాలతో సహా బహుళ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానాల "స్పష్టమైన ఉల్లంఘన"గా అభివర్ణించారు. 1967 నుండి ఆక్రమించబడిన పాలస్తీనా భూభాగాల్లో ఇజ్రాయెల్ ఆక్రమణ , స్థిరనివాస కార్యకలాపాల చట్టబద్ధతను ఈ తీర్మానాలన్నీ తిరస్కరిస్తున్నాయని తెలిపారు.

పాలస్తీనా రాష్ట్రంలో అంతర్భాగంగా ఉన్న తూర్పు జెరూసలేం సహా ఆక్రమిత పాలస్తీనా భూభాగంపై ఇజ్రాయెల్‌కు సార్వభౌమాధికారం లేదని ఉమ్మడి ప్రకటనలో పునరుద్ఘాటించారు.  ఏకపక్ష ఇజ్రాయెల్ చర్యకు చట్టపరమైన ప్రభావం లేదని, ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలను పెంచడానికి మాత్రమే ఉపయోగపడుతుందని ప్రకటనలో తెలిపారు.  తూర్పు జెరూసలేం రాజధానిగా 1967 సరిహద్దులలో స్వతంత్ర, సార్వభౌమ పాలస్తీనా రాజ్య స్థాపనకు ప్రపంచ దేశాలు మద్దతు ఇవ్వాలని మరోసారి పిలుపునిచ్చాయి.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com