కోర్టు పై కాల్పులకు తెగబడ్డ ఉగ్రవాదులు
- July 26, 2025
ఇరాన్: ఆగ్నేయ ఇరాన్లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. ఏకంగా కోర్టుపైనే కాల్పులు జరిపారు. ఇరాన్ స్థానిక సమయం ప్రకారం శుక్రవారం సిస్తాన్-బలూచెస్తాన్ ప్రావిన్స్ రాజధాని జహెదాన్లోని కోర్టు బిల్డింగ్పై ఉగ్రవాదులు దాడి చేశారు.తుపాకులతో కాల్పులు జరిపారు.ఈ దాడిలో ఎనిమిది మంది మరణించారు.ఈ ప్రాంతంలో సున్నీ ఉగ్రవాద సంస్థ జైష్ అల్-అద్ ఈ దాడికి బాధ్యత హిస్తున్నట్లు ఇరాన్ మీడియా పేర్కొంది.కోర్టు భవనం చుట్టూ కాల్పులు, పేలుళ్ల శబ్దాలు విన్నట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు.ఇందులో ఆత్మాహుతి దాడి జరిగి ఉండవచ్చనిఅనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
కాల్పులకు కారణాలు
సెంట్రల్ జహెదాన్లోని కోర్టుహాల్ సముదాయంలో న్యాయమూర్తుల గదుల్లోకి ముష్కరులు చొరబడ్డారు.కనీసం 13 మంది గాయపడి ఆసుపత్రి పాలయ్యారని ఇరాన్ ప్రభుత్వ వార్తా సంస్థ ఐఆర్ఎన్ఎ ప్రకటించింది.బలూచ్ ప్రాంతాన్ని పర్యవేక్షిస్తున్న మానవ హక్కుల సంస్థ
వాచ్ఎఎల్టిఎస్ హెచ్,ఈ దాడిలో అనేక మంది జుడిషియల్ ఆఫీసర్లు, భద్రతా సిబ్బంది మరణించారని లేదా గాయపడ్డారని చెప్పింది.
ఇరాన్‌లో మంచు పడుతుందా?
అవును, ఇరాన్‌లో కొన్ని ప్రాంతాలలో మంచు పడుతుంది.ముఖ్యంగా ఉత్తర మరియు పడమర ప్రాంతాలలోని పర్వత ప్రాంతాలలో శీతాకాలంలో తరచుగా మంచు కురుస్తుంది.అల్‌బొర్జ్ జాగ్రోస్ పర్వత శ్రేణులు మంచు కోసం ప్రసిద్ధి గాంచినవి.
ఇరాన్ ప్రధాన ఎగుమతి ఉత్పత్తి ఏమిటి?
ఇరాన్ యొక్క ప్రధాన ఎగుమతులు చమురు మరియు ప్రాకృతిక వాయువు. ఇవి దేశానికి వచ్చే ఎగుమతి ఆదాయంలో సుమారు 82 శాతం వరకు వాటా కలిగి ఉంటాయి.
తాజా వార్తలు
- అమెరికాలో నలుగురు భారత సంతతి వ్యక్తుల హత్య
- కువైట్ లో ఘనంగా నారా లోకేష్ జన్మదిన వేడుకలు
- బహ్రెయిన్ లో రోడ్డు ప్రమాదం..చిన్నారి సహా ముగ్గురు మృతి..!!
- చలి కుంపట్ల పై కువైట్ ఫైర్ ఫోర్స్ వార్నింగ్..!!
- గ్లోబల్ ఫాస్టెస్ట్ మొబైల్ ఇంటర్నెట్ సిటీగా దోహా..!!
- సౌదీయేతరుల కోసం 170 జోన్లు కేటాయింపు..!!
- దుబాయ్లో ట్రక్ డీజిల్ చోరీ..ఇద్దరు వ్యక్తులకు జైలుశిక్ష..!!
- ఒమన్ లో ఇండియన్ వెస్ట్రన్ నావల్ కమాండ్ కమాండర్..!!
- NRI టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో నారా లోకేష్ జన్మదిన వేడుకలు
- Google 2026 Internship:యువత కోసం గోల్డెన్ ఛాన్స్







