నార్త్ అల్ షర్కియాలో ప్లాస్టిక్-ఫ్రీ మార్కెట్ క్యాంపెయిన్ ప్రారంభం..!!

- August 08, 2025 , by Maagulf
నార్త్ అల్ షర్కియాలో ప్లాస్టిక్-ఫ్రీ మార్కెట్ క్యాంపెయిన్ ప్రారంభం..!!

ఒమన్: ఒమన్ లో ప్లాస్టిక్ ఫ్రీ క్యాంపెయిన్ జోరుగా సాగుతోంది. ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధానికి సంబంధించి మూడవ దశను అమలు చేసేందుకు వీలుగా ఎన్విరాన్‌మెంట్ అథారిటీ నార్త్ అషర్కియా గవర్నరేట్‌లోని  ఓపెన్-ఎయిర్ మార్కెట్లలో "ప్లాస్టిక్-ఫ్రీ మార్కెట్" క్యాంపెయిన్ ను ప్రారంభించింది. ఈ సందర్భంగా గవర్నరేట్‌ పర్యావరణ శాఖ డైరెక్టర్ మొహమ్మద్ అమెర్ అల్ హజ్రీ ప్లాస్టిక్ బ్యాగుల కారణంగా పర్యావరణానికి జరిగే నష్టాన్ని వివరించారు. రాబోయే రోజుల్లో ఇతర మార్కెట్లలోనూ ఈ క్యాంపెయిన్ కొనసాగుతుందని తెలిపారు.
క్యాంపెయిన్ సందర్భంగా అధికారులు షాపుల ఓనర్లకు రీయూజ్ బ్యాగులను అందజేశారు. ప్లాస్టిక్ ఫ్రీ క్యాంపెయిన్ కు సంబంధించిన బ్రోచర్లను పంపిణీ చేశారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com