విమానాశ్రయానికి సెల్ఫ్ డ్రైవింగ్ కారులో రియాద్ డిప్యూటీ ఎమిర్..!!

- August 23, 2025 , by Maagulf
విమానాశ్రయానికి సెల్ఫ్ డ్రైవింగ్ కారులో రియాద్ డిప్యూటీ ఎమిర్..!!

రియాద్:  రియాద్ డిప్యూటీ ఎమిర్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ అబ్దుల్‌రెహ్మాన్, సౌదీ అరేబియా ట్రాన్స్ పోర్ట్ మినిస్టర్ సలేహ్ అల్-జాసర్‌తో కలిసి, రియాద్ వీధుల గుండా కింగ్ ఖలీద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి సెల్ఫ్ డ్రైవింగ్ వాహనంలో ప్రయాణించారు.  ఈ సందర్భంగా వారు అనేక ప్రధాన అభివృద్ధి ప్రాజెక్టులపై సమీక్షలు నిర్వహించారు.

వీరి ప్రయాణం రోష్న్ ఫ్రంట్ వద్ద ప్రారంభమై విమానాశ్రయ టెర్మినల్స్ వద్ద ముగిసింది. రియాద్ లో ఎంపిక చేసిన ప్రదేశాలలో మొదటి దశ సెల్ఫ్ డ్రైవింగ్ సేవలను ప్రారంభించడంపై ట్రయల్ నిర్వహించాలని సూచించారు. 

అనంతరం ప్రిన్స్ మొహమ్మద్ అంతర్జాతీయ టెర్మినల్ 1 అండ్ 2 వద్ద అభివృద్ధి పనులను పరిశీలిచారు.    అంతకుముందు విమానాశ్రయానికి చేరుకున్న డిప్యూటీ గవర్నర్‌ను జనరల్ అథారిటీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అధ్యక్షుడు అబ్దులాజీజ్ అల్-దువైలెజ్ స్వాగతం పలికారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com