గుండె ఆరోగ్యం కోసం శక్తివంతమైన ఫుడ్..
- August 25, 2025
మన శరీరంలోని ముఖ్యమైన అవయవాలలో గుండె (Heart Health) అతి ప్రధానమైనది. గుండె ఆరోగ్యం బాగుండాలి అంటే జీవనశైలి, ఆహారం, వ్యాయామం చాలా అవసరం. ముఖ్యంగా రోజును ప్రారంభించే ఉదయాన్నే తీసుకునే ఆహారం గుండె ఆరోగ్యంలో చాలా కీలకం. ఇది శరీరానికి మాత్రమే కాకుండా గుండెకు రక్షణ కూడా అందిస్తుంది. కాబట్టి, ఉదయాన్నే తీసుకోవటానికి గుండెకు ఎంతో మేలు చేసే 5 రకాల ఆహార పదార్థాల గురించి ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
1.ఓట్స్:
మన శరీరంలోని ముఖ్యమైన అవయవాలలో గుండె (Heart) అతి ప్రధానమైనది. గుండె ఆరోగ్యం బాగుండాలి అంటే జీవనశైలి, ఆహారం,ఓట్స్‌లో బీటా గ్లూకాన్ అనే ధాన్యం తంతువు ఉంటుంది. ఇది బ్యాడ్ కొలెస్ట్రాల్ (LDL) ను తగ్గించడంలో సహాయపడుతుంది. వేడి పాలు లేదా నీటిలో ఓట్స్ ఉడికించి తింటే మంచి ఫలితాలు అందుతాయి. వాటిలో కొద్దిగా తేనె, డ్రై ఫ్రూట్స్ కూడా చేర్చుకోవచ్చు.
2.బేరీలు:
బ్లూబెర్రీలు, స్ట్రాబెర్రీలు, రాస్బెర్రీలు వంటి బేరీలు యాంటీ ఆక్సిడెంట్లు, పాలిఫినాల్స్ తో నిండివుంటాయి. ఇవి గుండె నాళాల్లో రక్తప్రవాహాన్ని మెరుగుపరుస్తాయి. కాబట్టి వీటిని దోస, ఓట్స్, దహితో కలిపి తీసుకోవచ్చు. తాజా ఫ్రూట్ బౌల్లలో, సలాడ్స్ లో కూడా కలిపి తినవచ్చు.
3.అవోకాడో:
అవోకాడోలో మోనోసాచ్యురేటెడ్ ఫ్యాట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండెకు మంచి కొవ్వులుగా పనిచేస్తాయి. ఇందులో పొటాషియం, ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది. బ్రెడ్ టోస్ట్‌లో వేసుకొని తినవచ్చు. స్మూతీగా లేదా సలాడ్‌గా కలిపి తీసుకోవచ్చు.
4.చిక్కుడు వర్గపు మొలకలు:
మొలకలలో ఉండే ప్రోటీన్, ఐరన్, ఫైబర్, మాగ్నీషియం, పోటాషియం వంటివి హృదయ ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడతాయి. మొలుకలలో తేనె, నిమ్మరసం చల్లి తింటే మంచి ఫలితాలు అందుతాయి. లేదా ఉడికించి సలాడ్ గా కూడా తినవచ్చు.
5.వాల్నట్ లేదా బాదం:
వీటిలో ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్లు, విటమిన్ E, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండెకు చాలా ప్రయోజనకరం. ఉదయాన్నే 4 నుంచి 5 బాదం లేదా 2 నుంచి 3 వాల్నట్ తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది.
తాజా వార్తలు
- భారత్‌కు అమెరికా కొత్త రాయబారిగా సెర్గియో గోర్ నియామకం
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!
- ఓవర్‌టేకింగ్, లేన్ స్కిప్పింగ్.. డ్రోన్లతో ట్రాఫిక్ పర్యవేక్షణ..!!
- అలెర్ట్: ఫుజైరాలో భారీ వర్షాలు..వాటర్ ఫాల్స్ కనువిందు..!!
- ప్రైవేట్ స్కూళ్లలో సంస్కరణలకు బహ్రెయిన్ శ్రీకారం..!!
- షురా కౌన్సిల్ ను సందర్శించిన భారత ప్రతినిధి బృందం..!!
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్