సౌదీ అరేబియాలో సెంట్రల్ కిచెన్‌లకు కొత్త గైడ్ లైన్స్ జారీ..!!

- August 27, 2025 , by Maagulf
సౌదీ అరేబియాలో సెంట్రల్ కిచెన్‌లకు కొత్త గైడ్ లైన్స్ జారీ..!!

రియాద్: సౌదీ అరేబియాలో సెంట్రల్ కిచెన్‌ల నిర్వహణ కోసం మునిసిపాలిటీలు, గృహనిర్మాణ మంత్రిత్వ శాఖలు నియంత్రణ గైడ్ లైన్స్ ను విడుదల చేశాయి.  సవరించిన నిబంధనల ప్రకారం సెంట్రల్ కిచెన్ లకు సర్టిఫైడ్ ఫుడ్ సేఫ్టీ స్పెషలిస్ట్ తప్పనిసరి అని నిర్దేశించారు. కిచెన్ వ్యర్థాల నిర్వహణ కోసం ఖచ్చితమైన ప్రొఫెషనల్ మెకానిజమ్‌లను అమలు చేయడంతో పాటు పని ప్రాంతాలను కవర్ చేసేలా సీసీ కెమెరాల ఏర్పాటు, నమ్మకమైన ఎలక్ట్రానిక్ చెల్లింపు వ్యవస్థలు, కార్మికులకు టాయిలెట్లు, విశ్రాంతి గదులు మరియు దుస్తులు మార్చుకునే గదులతో సహా ప్రత్యేక సౌకర్యాలను అందించాల్సి ఉంటుంది. 

ఆహార తయారీ నుంచి సరఫరా వరకు తప్పనిసరిగా నిబంధనల ప్రకారం ప్రమాణాలను పాటించాలని స్పష్టం చేశారు.  కొత్త నిబంధనలు సెంట్రల్ కిచెన్ల నిర్వహణ మరియు నిర్వహణలో గుణాత్మక మార్పును సూచిస్తాయని మంత్రిత్వ శాఖ చెప్పింది. పూర్తి  నిబంధనలను https://momah.gov.sa/ సైట్ లో చూడాలని సూచించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com