గాజాలో కరువు, జాతి విధ్వంస యుద్ధాన్ని ఆపండి..!!

- August 27, 2025 , by Maagulf
గాజాలో కరువు, జాతి విధ్వంస యుద్ధాన్ని ఆపండి..!!

జెద్దా: గాజా స్ట్రిప్‌లో కరువును అంతం చేయడానికి మరియు పాలస్తీనా ప్రజలపై ఇజ్రాయెల్ దళాలు చేస్తున్న జాతి విధ్వంస యుద్ధాన్ని ఆపడానికి అంతర్జాతీయ సమాజానికి, ముఖ్యంగా UN భద్రతా మండలిలోని శాశ్వత సభ్యులకు సౌదీ అరేబియా పిలుపునిచ్చింది. ఈ మేరకు రెండు పవిత్ర మసీదుల సంరక్షకుడు రాజు సల్మాన్ అధ్యక్షతన జెడ్డాలో జరిగిన సౌదీ మంత్రుల మండలి పునరుద్ఘాటించింది.  

ఈ సమావేశం తర్వాత మీడియా మంత్రి సల్మాన్ అల్-దోసరీ మాట్లాడుతూ.. పాలస్తీనా ప్రజలపై కొనసాగుతున్న ఇజ్రాయెల్ దురాక్రమణ, మారణహోమాన్ని ఆపడానికి యంత్రాంగాలను సమన్వయం చేయడం, గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్ నిర్ణయాలు మరియు ప్రణాళికలను చర్చించడానికి సోమవారం జెడ్డాలో జరిగిన ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ (OIC) విదేశాంగ మంత్రుల మండలి సమావేశం వివరాలను క్యాబినెట్ మద్దతు తెలిపిందన్నారు.

ఇజ్రాయెల్ ఉల్లంఘనలు అంతర్జాతీయ చట్ట నియమాలను దెబ్బతీస్తుందని, ప్రాంతీయ మరియు ప్రపంచ భద్రత శాంతికి ముప్పు కలిగించే అవకాశం ఉందని క్యాబినెట్ అభిప్రాయపడింది. పాలస్తీనాలో ఇజ్రాయెల్ కొనసాగిస్తున్న ఉల్లంఘనలను, సిరియన్ భూభాగంలోకి దాని చొరబాటును కౌన్సిల్ తీవ్రంగా ఖండించిందని తెలిపారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com