గణేశ్ ఉత్సవాలకు మెట్రో రైల్ అదునపు సేవలు

- August 30, 2025 , by Maagulf
గణేశ్ ఉత్సవాలకు మెట్రో రైల్ అదునపు సేవలు

హైదరాబాద్: హైదరాబాద్‌లో గణపతి నవరాత్రులు జోరుగా కొనసాగుతున్న నేపథ్యంలో, మెట్రో రైల్ సంస్థ భక్తుల కోసం శుభవార్త తెలిపింది. నగరంలో ఎక్కువ రద్దీని దృష్టిలో పెట్టుకుని, ఈరోజు మెట్రో సేవల సమయాన్ని పొడిగిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ ప్రకారం, అన్ని టెర్మినల్ స్టేషన్ల నుంచి చివరి రైలు రాత్రి 11:45 గంటలకు బయలుదేరనుంది.

ప్రస్తుతం నగరంలోని అనేక ప్రాంతాల్లో గణేశ్ మండపాలు ఏర్పాటు కావడంతో, భక్తులు విస్తారంగా పాల్గొంటున్నారు. వారాంతం కావడంతో ఆలయాలు, పండల్‌ల వద్ద భారీగా రద్దీ ఉంటుందని అంచనా. ఇలాంటి పరిస్థితుల్లో రాత్రి వేళల్లో ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు మెట్రో యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుంది.

రాత్రి వేళల్లో సర్వీసులు అందుబాటులో ఉండడం వల్ల భక్తులు ప్రశాంతంగా దర్శనాలు ముగించుకుని, తమ ఇళ్లకు సులభంగా చేరుకోవచ్చని అధికారులు తెలిపారు. సాధారణ రోజులతో పోలిస్తే ఆలస్యంగా రైళ్లు నడపడం ద్వారా భక్తులకు ఎక్కువ సమయం ఇవ్వడమే తమ లక్ష్యమని మెట్రో స్పష్టం చేసింది. భక్తులు ఎలాంటి తొందరపాటు లేకుండా, ఆరామంగా వినాయక దర్శనాలు చేసుకోవడానికి ఈ సౌకర్యం అందిస్తున్నాం” అని మెట్రో అధికారిక ప్రకటనలో పేర్కొంది. ఈ ప్రత్యేక ఏర్పాటుతో, గణేశ్ ఉత్సవాల సమయంలో ప్రజలకు మరింత సౌకర్యం కలుగనుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com