ఒమన్ లో ఈత కొడుతూ గుండెపోటుతో మరణించిన కేరళ వాసి..!!

- August 30, 2025 , by Maagulf
ఒమన్ లో ఈత కొడుతూ గుండెపోటుతో మరణించిన కేరళ వాసి..!!

మస్కట్: దక్షిణ భారత రాష్ట్రమైన కేరళకు చెందిన ఒక భారతీయ ప్రవాసుడు శుక్రవారం మస్కట్‌లోని కల్బూహ్ పార్క్‌లో ఈత కొడుతూ తీవ్రమైన గుండెపోటుతో మరణించాడు. కేరళలోని ఎర్నాకుళం జిల్లాకు చెందిన 45 ఏళ్ల భారతీయ ఇంజనీర్ కృష్ణ నాయర్‌గా గుర్తించారు.   

కృష్ణ మస్కట్‌లోని ఒక ఇంజనీరింగ్ కన్సల్టెన్సీ సంస్థలో పనిచేస్తున్నాడు. స్విమ్మింగ్ కోచ్  తోపాటు ట్రెక్కింగ్ నిపుణుడిగా సెవలు అందిస్తున్నాడు.  అతను ఖల్బూహ్ పార్క్‌లో వందలాది మంది పిల్లలు, నివాసితులకు ఈతలో శిక్షణ ఇచ్చాడు. అతని భార్య స్వప్న, కేరళ ప్రభుత్వ ఉద్యోగి. ఇద్దరు పిల్లలు రఘురామ కృష్ణ మరియు పూర్ణిమ కృష్ణ ఉన్నారు.

కృష్ణ నాయర్ అకాల మరణానికి అలావి స్విమ్మింగ్ అకాడమీకి చెందిన డాక్టర్ సంఘవి మరియు ఇతరులు సంతాపం తెలిపారు. “మా ప్రియమైన యువ కెప్టెన్ కృష్ణ నాయర్ ఆకస్మిక మరణం మమ్మల్ని బాధపెట్టింది. మా దుఃఖాన్ని మాటల్లో వ్యక్తపరచలేము. ఈ కోలుకోలేని నష్టాన్ని భరించడానికి ఆయన కుటుంబానికి శక్తిని ఇవ్వాలని మేము దేవుడిని ప్రార్థిస్తున్నాము.” అని తమ సంతాప సందేశంలో పేర్కొన్నారు.

ఆయన మృతదేహాన్ని కేరళకు స్వదేశానికి తరలించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని సామాజిక కార్యకర్తలు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com