బహ్రెయిన్ విమానాశ్రయంలో 11% పెరిగిన ప్రయాణీకుల సంఖ్య..!!
- August 30, 2025
మనామా: బహ్రెయిన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రయాణీకుల 11శాతం పెరిగింది. జూలై లో 865,753 మంది ప్రయాణికులు రాకపోకలు సాగించగా, జూన్‌లో ఈ సంఖ్య 780,000 గా ఉంది. ఈ మేరకు బహ్రెయిన్ సివిల్ ఏవియేషన్ తెలిపింది. నెలవారీ పెరుగుదల 85 వేల మంది ప్రయాణికులుగా ఉంది. ఇక బయలుదేరిన ప్రయాణికుల సంఖ్య 453,944కి చేరుకుంది.
8,748 విమాన సర్వీసులు నమోదయ్యాయి. దాదాపు 47,832 విమానాలు బహ్రెయిన్ వైమానిక ప్రాంతాన్ని వినియోగించుకున్నాయి. మొత్తం కార్గో మరియు ఎయిర్ మెయిల్ 35,129 టన్నులకు చేరుకుంది. వీటిలో 13,760 టన్నుల దిగుమతులు, 8,614 టన్నుల ఎగుమతులు ఉన్నాయి.
అత్యంత రద్దీ మార్గాల పరంగా చూస్తే..ఇండియాలోని బెంగళూరు మరియు హైదరాబాద్ నగరాల నుంచి 37,266 మంది ప్రయాణికులు ఉండగా, 117 శాతం పెరిగింది. అబుదాబి 31 శాతం పెరిగి 57,301 మంది ప్రయాణికులకు చేరుకోగా, దోహా 18 శాతం పెరిగి 54,101 మందికి చేరుకుంది.
తాజా వార్తలు
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!
- సౌదీలో అక్రమ డ్రైవర్ల పై ఉక్కుపాదం..!!
- సెప్టెంబర్‌లో ఖతార్ కు పోటెత్తిన ప్యాసింజర్స్..!!
- స్వీట్లు తినిపించి పిల్లల గొంతుకోసి చంపిన తండ్రి
- షార్జాలో జైవాకర్ల పై కఠిన చర్యలు..!!
- యూరప్‌కు వెళుతున్నారా? అమల్లోకి వచ్చిన న్యూ రూల్స్..!!
- BHD 52,000 VAT ఎగవేతపై దర్యాప్తు పూర్తి..!!
- భారత్‌కు అమెరికా కొత్త రాయబారిగా సెర్గియో గోర్ నియామకం
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!