OTTలో దూసుకుపోతున్న మా మూవీ

- August 31, 2025 , by Maagulf
OTTలో దూసుకుపోతున్న మా మూవీ

ఇటీవల కాలంలో ఓటీటీల్లో హారర్ సినిమాల కోసం ప్రేక్షకులు ప్రత్యేక ఆసక్తి చూపుతున్నారు. భయానక వాతావరణం, ఉత్కంఠ కలిగించే సన్నివేశాలు ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాయి.ఈ క్రమంలో తాజాగా విడుదలైన ఒక హారర్ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటూ టాప్ 10 ట్రెండింగ్ జాబితాలోకి దూసుకుపోయింది.

బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ కాజోల్ ప్రధాన పాత్రలో నటించిన మా సినిమా ఇప్పుడు ఓటీటీ ప్రపంచాన్ని షేక్ చేస్తోంది. ఈ చిత్రంలో ఆమె అంబిక అనే తల్లి పాత్రలో కనిపించారు. భర్త మరణం తర్వాత తన టీనేజ్ కుమార్తెతో కలిసి నగరంలో జీవనం సాగించే అంబిక, కొన్ని పరిస్థితుల కారణంగా తన పూర్వీకుల గ్రామానికి వెళ్లి అక్కడి పాత ఇంటిని అమ్ముకోవాల్సి వస్తుంది. కానీ ఆ ఇంటికి వెళ్లిన తర్వాత వారి జీవితంలో ఊహించని ప్రమాదాలు మొదలవుతాయి.

ఆ గ్రామంలో చాలా కాలంగా యువతులు రహస్యంగా అదృశ్యం అవుతూ ఉండటం, చంపబడటం వంటి సంఘటనలు జరుగుతాయి. ప్రజలు ఈ ఘటనల వెనుక ఒక దుష్టశక్తి ఉందని నమ్ముతారు. అంబిక కుమార్తె ఒక వింత వ్యాధితో బాధపడుతుండటంతో ఆ దుష్టశక్తి ఆమెను లక్ష్యంగా చేసుకుంటుంది. ఈ పరిస్థితుల్లో తన కుమార్తెను రక్షించుకోవడానికి అంబిక దుష్టశక్తితో భీకరమైన పోరాటానికి దిగుతుంది.

అంబిక తన పూర్వీకుల ఇంటిలో కొన్ని పాత పుస్తకాలు, టాల గుర్తులు కనుగొంటుంది. వీటివల్ల తమ కుటుంబానికి ఒకప్పుడు దుష్టశక్తులను నియంత్రించే ప్రత్యేక శక్తి ఉందని తెలుసుకుంటుంది. ఆ రహస్యాలను ఆధారంగా చేసుకుని అంబిక తన కుమార్తెను మాత్రమే కాకుండా గ్రామ ప్రజలనే రక్షించడానికి ప్రయత్నిస్తుంది.

133 నిమిషాల నిడివి గల ఈ హారర్ సినిమా ఆద్యంతం ఉత్కంఠను కలిగిస్తూ ప్రేక్షకులను రెప్పవేయనీయదు. ప్రతి సన్నివేశం భయాన్ని, ఆసక్తిని కలిగించేలా తెరకెక్కింది. క్లైమాక్స్‌లో జరిగే మలుపులు ప్రేక్షకులను సీటు ఎడ్జ్‌కి నెట్టేస్తాయి.

ఈ చిత్రానికి విశాల్ ఫురియా దర్శకత్వం వహించగా, కాజోల్‌తో పాటు రోనిత్ రాయ్, గోపాల్ సింగ్, ఇంద్రనీల్ సేన్‌గుప్తా కీలక పాత్రల్లో నటించారు. శక్తివంతమైన కథ, కాజోల్ ప్రదర్శన, భయపెట్టే నేపథ్య సంగీతం కలిసి ఈ సినిమాను ప్రత్యేకంగా నిలబెట్టాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com