ట్రక్కు డ్రైవర్లు, యజమానులకు హెచ్చరికలు జారీ..!!

- September 05, 2025 , by Maagulf
ట్రక్కు డ్రైవర్లు, యజమానులకు హెచ్చరికలు జారీ..!!

మనామా: రోడ్లపై ట్రక్కుల కదలికలపై బహ్రెయిన్ మునిసిపాలిటీ హెచ్చరికలు జారీ చేసింది. నిబంధనలు పాటించని ట్రక్కులకు భారీ జరిమానాలు విధిస్తామని హెచ్చరించింది.  ఈ మేరకు ట్రక్కు డ్రైవర్లకు అవగాహన కల్పిస్తున్నట్లు వెల్లడించింది.  

ముఖ్యంగా మూసి ఉంచని ట్రక్కుల నుండి ఇసుక , నిర్మాణ సామగ్రి రోడ్లపై పడి వాహనదారులకు ఇబ్బంది కలిగిస్తుందన్నారు. కొన్ని సందర్భాల్లో ప్రమాదాలకు కారణం అవుతుందని తెలిపింది.  సురక్షితమైన మరియు పరిశుభ్రమైన రోడ్ల కోసం వాహనదారులంతా సహకరించాలని, నిబంధనలను కచ్చితంగా పాటించాలని పిలుపునిచ్చింది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com